
సరిలేరు నీకెవ్వరూ అంటూ తమ హీరో పాటను మళ్లీ మళ్లీ పాడుకుంటున్నారు మహేష్ ఫ్యాన్స్. ఇప్పుడు చేస్తున్న ఎస్ఎస్ఎంబీ29కి ఇంకాస్త సమయం పడుతుందని మాకూ తెలుసు. ఎంత బడ్జెట్ అయినా ఫర్వాలేదు... ఇంటర్నేషనల్ రేంజ్‌లో బొంబాట్ చేయడమే లక్ష్యం అన్నట్టు తీర్చిదిద్దుతున్నారు జక్కన్న. ఈ సినిమా తర్వాత మహేష్ ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటారు?

ఇకపై పక్కా లోకల్ సినిమా చేసే అవకాశం ఉండకపోవచ్చని ఓపెన్‌గానే చెప్పేశారు మహేష్. రాజమౌళితో మూవీ కంప్లీట్ చేశాక ప్యాన్ ఇండియా డైరక్టర్లను అప్రోచ్ అవుతారనే టాక్ ఉంది.

ఆల్రెడీ ప్యాన్ ఇండియా రేంజ్‌లో గుర్తింపు తెచ్చుకున్న మన కెప్టెన్లతోనూ మూవీస్ చేస్తారనే మాటలు నడుస్తున్నాయి. మహేష్ - సుకుమార్ కాంబో కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కూడా లేకపోలేదు.

చేయబోయే స్పిరిట్, ఆ తర్వాత యానిమల్ పార్క్... ఈ రెండు సినిమాల తర్వాత సందీప్‌రెడ్డి వంగా ఏం చేస్తారు? ఫ్యూచర్‌ని దృష్టిలో పెట్టుకుని ఆయన రెడీ చేసిన స్క్రిప్ట్స్ లో మహేష్ కోసం కొన్ని స్పెషల్స్ ఉన్నట్టు సమాచారం.

ఆల్రెడీ ఉప్పెనతో మెప్పించిన బుచ్చిబాబు సానా ఇప్పుడు చేస్తున్న పెద్ది క్లిక్ అయితే, నెక్స్ట్ మహేష్‌తో సినిమా చేసే అవకాశం ఉంటుందనే మాటలు కూడా ఫిల్మ్ నగర్‌లో వైరల్ అవుతున్నాయి. ఆల్రెడీ సుకుమార్ శిష్యుడిగా వన్ మూవీకి పనిచేసిన అనుభవం ఉందట బుచ్చిబాబు సానాకి. సో, ఈ కాంబినేషన్‌కి స్కోప్ ఉంది. అన్నట్టు.. మహేష్‌కి బంపర్ హిట్ ఇచ్చిన అనిల్ రావిపూడి కూడా ఘట్టమనేని కాంపౌండ్ గుడ్ లుక్స్ లో ఉన్నారు.