
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కెరీర్ బిగినింగ్ నుంచి విభిన్నమైన కథలతో సినిమాలు చేసుకుంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.

ఈ యంగ్ హీరో డెడికేషన్ , కమిట్మెంట్ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఈ హీరో ప్రతిసినిమాకి ఎలా కష్టపడతాడో తెలియాలిగా..

ఎంత మెగా ఫ్యామిలీ లో పుడితే మాత్రం టాలెంట్ ఉంటేనే కదా ఇండస్ట్రీ లో నిలబడగలరు.గద్దల కొండ గణేష్ సినిమాలో తన నటనతో ప్రేక్షకులను మెప్పించాడు వరుణ్.

మాస్ క్యారెక్టర్ లో మెస్మరైజ్ చేశాడు వరుణ్. ఈ క్రమంలోనే తాజాగా వరుణ్ మరో ప్రయోగాత్మక చిత్రంతో ప్రేక్షకుల ముందకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు.

ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోన్న వరుణ్.. మరో చిత్రాన్ని ప్రకటించాడు.అయితే వరుణ్ బాడీ కట్ అవుట్ గురించి అందరికి తెలిసిందే.

తన హ్యాండ్సమ్ నెస్ తో అమ్మాయిల డ్రీం బాయ్ గా మంచి ఇమేజ్ సంపాదించుకున్నాడు ఈ మెగా ప్రిన్స్. జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ , ఫోటోషూట్ లో పాల్గొని తాజా ఫొటోస్ తో ఓ హైప్ క్రియేట్ చేసాడు.

ఇప్పుడు ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. చాల తక్కువ సార్లు మాత్రమే ఫొటోస్ షేర్ చెయ్యడం కారణంగా లేడీ ఫ్యాన్స్ ఈ ఫొటోస్ డౌన్లోడ్ చేస్తున్నారు.

ఎంత అయినా మెగా హీరో కదా ఆ మాత్రం ఉండాలి అంటూ కామెంట్ చేస్తున్నారు మెగా అభిమానులు.

వరుణ్ తేజ్ కొణిదల న్యూ ఫొటోస్

వరుణ్ తేజ్ కొణిదల న్యూ ఫొటోస్

వరుణ్ తేజ్ కొణిదల న్యూ ఫొటోస్