
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటల్లో వరుణ్ సందేశ్- వితికా షేరు జోడీ ఒకటి. 2016లో వీరిద్దరూ పెద్దల అనుమతితో పెళ్లిపీటలెక్కారు.

పడ్డానండి ప్రేమలో సినిమా లో హీరో, హీరోయిన్లుగా నటించారు వరుణ్ సందేశ్- వితికా షేరు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే మనసులు ఇచ్చిపుచ్చుకున్నారు వరుణ్, వితిక.

పెళ్లి తర్వాత వితిక సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటోంది. అయితే అప్పుడప్పుడు టీవీ షోల్లో మాత్రం కనిపిస్తుంటుందీ అందాల తార.

ఇక సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది వితిక. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ విషయాలను అందులో షేర్ చేస్తుంటుంది.

అలా తాజాగా వరుణ్ సందేశ్- వితికా షేరు జంటగా అరుణాచల క్షేత్రానికి వెళ్లారు. అక్కడ ఇద్దరూ గిరి ప్రదక్షిణం చేసిన అనంతర స్వామి వారిని దర్శించుకున్నారు.

తమ అరుణాచల యాత్రకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశారు వరుణ్- వితిక. ప్రస్తుతం ఇవి నెట్టింట వైరలవుతున్నాయి.