
సామాన్యులతో పాటు సినిమా సెలబ్రిటీలు కూడా అయ్యప్ప స్వామి మాలను ధరించడం ఆనవాయితీగా వస్తోంది. ఏటా చాలా మంది హీరోలు ఈ దీక్షను స్వీకరించి భక్తి శ్రద్ధలు, నియమ నిష్టలతో అయ్యప్ప స్వామిని పూజిస్తున్నారు

గతంలో మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, నితిన్, రామ్ పొతినేని, వరుణ్ తేజ్, శర్వానంద్, ఎన్టీఆర్, న్యాచురల్ స్టార్ నాని.. ఇలా చాలా మంది హీరోలు అయ్యప్ప మాల ధరించారు.

ఇటీవల టాలీవుడ్ క్రేజీ హీరో వరుణ్ సందేశ్ కూడా అయ్యప్ప మాల వేసుకున్నారు. తన దీక్షకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నాడు.

తాజాగా అయ్యప్ప స్వామి పడి పూజను ఘనంగా నిర్వహించాడు వరుణ్ సందేశ్. ఈ పూజా కార్యక్రమంలో అతని భార్య వితిక షేరు పాల్గొంది.

అయ్యప్ప పడి పూజకు సంబంధించిన ఫొటోలను తన ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసుకున్నాడు వరుణ్ సందేశ్. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన స్వాములందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపాడు.

ప్రస్తుతం వరుణ్ సందేశ్- వితికా షేరు చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాగా గతంలోనూ పలు మార్లు వరుణ్ సందేశ్ అయ్యప్ప మాలను ధరించినట్లు తెలుస్తోంది