
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్ వర్షిణి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. బుల్లితెర పై ప్రసారమయ్యే పలు షోలలో యాంకర్ గా వ్యవహరిస్తూ యాంకర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది.

వర్షిణి హైదరాబాదులో స్థిరపడిన తమిళ కుటుంబంలో రెండో కూతురుగా జన్మించింది. ఇక చదువు విషయానికి వస్తే ఆమె ఎలక్ట్రానిక్స్‌లో తన బ్యాచిలర్ డిగ్రీని పూర్తిచేసింది. ఆ తర్వాత మోడల్‌గా కెరీర్‌ను ప్రారంభించింది.

శంభో శివ శంభో చిత్రంలో చిన్న పాత్ర చేసిన వర్షినీ ఆ తర్వాత జాతీయ పురస్కారం గెలుచుకున్న చందమామ కథలు సినిమాలో కూడా నటించింది. ఇక ఆ తర్వాత ఆమె లవర్స్ , కాయ్ రాజా కాయ్ , బెస్ట్ యాక్టర్స్ వంటి చిత్రాలలో కనిపించింది. అన్నపూర్ణా స్టుడియోస్ నిర్మించిన పెళ్ళి గొల అనే వెబ్ సిరీస్‌లో నటించి మంచిపేరు తెచ్చుకుంది.

వర్షిణీ సుమంత్ సరసన మళ్లీ మొదలైంది అనే సినిమాలో నటించారు. ఈసినిమా డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదలై ఓకే అనిపించుకుంది. పటాస్ షో ద్వారా యాంకర్‌గా రీ ఎంట్రీ ఇచ్చిన వర్షిణి ఒకవైపు బుల్లితెరపై ప్రసారమయ్యే షోలకు యాంకర్ గా వ్యవహరిస్తూనే, మరొకవైపు వెబ్ సీరిస్ లో కూడా నటిస్తూ బిజీ బిజీగా ఉంది.

యాంకర్ వర్షిణి సౌందరాజన్ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. అందాల ఆరబోతలో దుమ్మురేపుతుంది. కోట్లాది మంది అభిమానులను అందంతో ఫిదా చేస్తుంటుంది. హాట్ హాట్ ఫోటో షూట్లతో నెటిజన్లని పడేస్తూ తన ఫాలోవర్స్ గా మార్చుకుంటుంది. ఈ అమ్మడికి నెట్టింట మంచి క్రేజ్ ఉంది.

అయితే ఈ బ్యూటీ ఇటీవల టీవీ షోస్‌ని వదిలేసి సినిమాలపై ఫోకస్ పెడుతుంది. సినిమాల్లో నటిస్తూ అలరిస్తుంది. ఆ మధ్య `శాకుంతలం` చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. మరోవైపు `భాగ్ సాలే` మూవీలోనూ మెరిసింది.