బేబీ సినిమాతో భారీ విజయాన్ని అందుకుంది వైష్ణవి చైతన్య. అంతకు ముందు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించిన ఈ ముద్దుగుమ్మ.. హీరోయిన్ గా తొలి సినిమాతోనే హిట్టు కొట్టింది. దీంతో ఇండస్ట్రీలో ఓ రేంజ్ క్రేజ్ వచ్చేసింది.
బేబీ తర్వాత వరుస ఆఫర్స్ అందుకుంటూ తక్కువ సమయంలో బిజీగా మారిపోయింది. ప్రస్తుతం సిద్ధు జొన్నలగడ్డ సరసన జాక్ మూవీలో నటిస్తుంది. ఇందులో వైష్ణవి లుక్ ఆకట్టుకుంటుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన కిస్ సాంగ్ వైరలవుతుంది.
జాక్ మూవీలో వైష్ణవి డ్యూయల్ రోల్ చేయబోతున్నట్లు సమాచారం. రెండు క్యారెక్టర్స్ డిఫరెంట్ గా ఉండనున్నాయని టాక్. ఇక ఎప్పటిలాగే ఈ సినిమాలో తెలంగాణ యాసలో అదరగొట్టనున్నట్లు తెలుస్తోంది.
అటు సినిమాలతో బిజీగా ఉన్న వైష్ణవి.. ఇప్పుడు ఇటు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా ఫోటోషూట్స్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన పిక్స్ మెస్మరైజ్ చేస్తున్నాయి.
బ్లాక్ స్టన్నింగ్ డ్రెస్ లో మరింత క్లాసీగా కనిపిస్తూ కుర్రాళ్ల హృదయాలు దోచేస్తుంది వైష్ణవి చైతన్య. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోస్ నెట్టింట వైరలవుతుండగా.. నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.