Rajeev Rayala |
Mar 26, 2021 | 12:52 PM
ఉప్పెన సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ముద్దుగుమ్మ కృతి శెట్టి. అందం అభినయంతో కుర్రకారు మనసు దోచేసింది ఈ చిన్నది.
మొదటి సినిమాతోనే చక్కటి నటనను కనబరిచి విమర్శకుల ప్రశంసలు అందుకుంది ఈ వయ్యారి
ఇక ఉప్పెన సినిమా సంచలన విజయం సాధించిన తర్వాత ఈ అమ్మడికి తెలుగులో అవకాశాలు క్యూ కడుతున్నాయి.
నేచురల్ స్టార్ నాని నటిస్తున్న శ్యామ్ సింగరాయ్ సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది కృతిశెట్టి
ఆ సినిమాతో పాటు యంగ్ హీరో సుదీర్ బాబు నటిస్తున్న ఓ చిత్రంలోనూ కృతిశెట్టి హీరోయిన్ గా నటిస్తుంది.
ఇక చాలా మంది కుర్రహీరోలు ఈ ముద్దుగుమ్మ పై కన్నేస్తున్నారు. తమ సినిమాలో ఈ బ్యూటీని హీరోయిన్ గా ఫిక్స్ చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు.
ఈ క్రమంలో అక్కినేని యంగ్ హీరో అఖిల్ కు జోడీగా ఈ అమ్మడు నటిస్తుందంటూ ఓ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది.
ఇక ఇదే అదునుగా కృతిశెట్టి రెమ్యునరేషన్ కూడా పెంచేసిందని టాక్ నడుస్తుంది.
ఇదిలా ఉంటే ఈ అమ్మడు వరుస అవకాశాలను అందిపుచ్చుకొని తక్కువ సమయంలోనే టాప్ హీరోయిన్ రేంజ్ కు వెళ్లే ఛాన్స్ లు ఉన్నాయని సినీ విశ్లేషకులు అంటున్నారు.