
మెగాస్టార్‌తో లేడీ సూపర్‌స్టార్ నయనతార నటించడం ఇప్పుడు కొత్తేం కాదు. ఆల్రెడీ సైరాలో భార్యగా నటించారు. ఈ మధ్య కాలంలో లూసిఫర్ రీమేక్‌లోనూ యాక్ట్ చేశారు. త్వరలోనే అనిల్ రావిపూడి సెట్స్‌లో చిరుతో కలిసి స్టెప్పులు వేయడానికి సిద్ధమవుతున్నారు లేడీ సూపర్‌స్టార్.

అయితే ఈ సినిమా కోసం ఆమె దాదాపు 18 కోట్లు అడిగారట. అంత ఇవ్వకపోయినా, కాస్త అటూ ఇటూగా ఇచ్చి ఫైనల్ చేశారన్నది టాక్. ఓ వైపు టెస్ట్ తరహా ఓటీటీ సినిమాలు చేస్తున్నా, స్టార్ హీరోల సినిమాల రెమ్మునరేషన్ల విషయంలో అసలు తగ్గడం లేదు నయన్.

Deepika Padukone

కాప్ డ్రామాలో దీపిక పక్కాగా ఫిట్ అవుతారని ఫిక్సయ్యారట సందీప్. అందుకే డార్లింగ్ పక్కన మరోసారి దీపిక అయితే బెస్ట్ అని అనుకుంటున్నారట. అందుకే స్పిరిట్ మూవీలో ఈమె హీరోయిన్గా కంఫర్మ్ చేసారని టాక్.

కాగా ఆల్రెడీ గత ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచిన కల్కిలో మెప్పించిన ఈ కాంబో, నెక్స్ట్ రానున్న కల్కి2, స్పిరిట్‌లోనూ అలరించడానికి రెడీ అవుతోందన్నది ఫ్యాన్స్‌కి నచ్చుతున్న మాట. త్వరలో స్పిరిట్ షూటింగ్ కూడా స్టార్ట్ కానుంది.