బుల్లితెరపై బిగ్ బాస్ రియాల్టీ షో ద్వారా క్రేజ్ సొంతం చేసుకుంది హమీద. ఈ షోలో అడుగుపెట్టకముందు ఈ అమ్మడు గురించి అసలు జనాలకు అంతగా తెలియదు. కానీ ఈ షోలో ఆట తీరుతో ఫేమస్ అయ్యింది.
ఆ తర్వాత బ్రహ్మముడు సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది. ఇందులో స్వప్న పాత్రలో నటించి మెప్పించింది. మొదట్లో ఇందులో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించింది. కానీ తర్వాత ఆమె పాత్రను పాజిటివ్ గా మార్చారు.
అయితే పాజిటివ్ గా మారిన తర్వాత హమీదాకు తెలుగులో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. అయితే ఉన్నట్లుండి ఆ సీరియల్ నుంచి తప్పుకుంది హమీద. అందుకు కారణాలు మాత్రం తెలియలేదు.
ప్రస్తుతం నెట్టింట క్రేజీ ఫోటోషూట్లతో రచ్చ చేస్తుంది. అటు ట్రెడిషనల్.. ఇటు మోడ్రన్ డ్రెస్సులతో రచ్చ చేస్తుంది. ఈ అమ్మాడి లేటేస్ట్ ఫోజులు చూసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్. తాజాగా మెహందీ కలర్ డ్రెస్ లో మెరిసిపోయింది.
మెహందీ కలర్ లెహంగాలో అచ్చం యువరాణిలా ముస్తాబయ్యింది హమీద. ఈ ముద్దుగుమ్మ లేటేస్ట్ ఫోటోషూట్ నెట్టింట తెగ వైరలవుతుండగా.. ఈ బ్యూటీ ఫోటోలకు భిన్నంగా రియాక్ట్ అవుతున్నారు ఫ్యాన్స్.