
దాదాపు రెండు దశాబ్దాలుగా సినీరంగంలో చక్రం తిప్పుతున్న హీరోయిన్ త్రిష. తెలుగు, తమిళంలో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించిన ఈ అమ్మడు.. ఇప్పటికీ వరుస సినిమాలతో అలరిస్తుంది. తాజాగా 44 ఏళ్ల వయసులో తన అందానికి సీక్రెట్స్ రివీల్ చేసింది. ఇంతకీ త్రిష ఏం చెప్పిందో తెలుసుకుందామా.

పొన్నియన్ సెల్వన్ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ లో అందరి దృష్టిని ఆకర్షించింది త్రిష. దీంతో ఆమెకు వరుస అవకాశాలు క్యూ కట్టాయి. ప్రస్తుతం చిరుతో కలిసి విశ్వంభర చిత్రంలో నటిస్తుంది. అలాగే తమిళంలోనూ వరుస సినిమాలు చేస్తూ కుర్ర బ్యూటీలకు పోటీనిస్తుంది.

త్రిష తన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి సైక్లింగ్, స్విమ్మింగ్, యోగ సాధన చేస్తుంది. ప్రతి రోజూ మిస్ కాకుండా ఈ పనులన్నింటిని చేస్తుంది. యోగా తన అందానికి ప్రధాన కారణం అంటుంది త్రిష. ఉదయం నిద్రలేవగానే ఎప్పుడూ వేడి నీటిని తీసుకుంటుంది.

సాయంత్రం దానిమ్మ రసం తాగుతుంది. త్రిష భోజనం తర్వాత తాజా నారింజ రసం తాగుతుంది. ఇవి ఆమె చర్మాన్ని తేమగా ఉంచుతుంది. త్రిష ఎప్పుడూ ఉప్పు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తినదు. షూటింగ్ కోసం తీసుకునే ఆహారంతో సహా బయటి ఆహారాన్ని కూడా తినదు.

త్రిష ఎక్కువగా నూనె లేకుండా ఆమ్లెట్లు, పరాఠాలు తింటుంది. అల్పాహారంగా పండ్లు, జ్యూస్‌లు తీసుకుంటుంది. అలాగే వర్కవుట్స్ చేయడం.. నిత్యం తాజా కూరగాయలు, పండ్లు తీసుకుంటుంది. ప్రాసెస్ చేసిన ఆహారానికి దూరంగా ఉంటుంది.