
టాలీవుడ్ సీనియర్ హీరోయిన్స్ త్రిష, ఛార్మీ, నికిషా పటేల్ రీయూనియన్ అయ్యారు. ఇటీవలే దుబాయ్ లోని బ్లూవాటర్ ఐలాండ్ లో జరిగిన వీరి రీయూనియన్ కు సంబంధించిన ఫోటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. కాగా వీరి ముగ్గురిని చూసి ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్.

ముగ్గురు దాదాపు 20 ఏళ్లుగా సినిమా రంగంలో బిజీగా ఉంటున్నారు. ఇప్పటికీ ఏమాత్రం తగ్గని అందంతో కుర్రహీరోయిన్లకు సైతం పోటీనిస్తున్నారు. పౌర్ణమి సినిమా నాటి తమ స్నేహాన్ని గుర్తు చేసుకుంటూ త్రిష, ఛార్మీలు ఒకరిపై ఒకరు ప్రేమను కురిపించుకున్న ఫోటోస్ ఆకట్టుకుంటున్నాయి.

ఈ అమ్మాయిలకు నేను అడిక్ట్ అయ్యాను అంటూ ఛార్మీ క్యాప్షన్ పెట్టగా.. బ్లూవాటర్ ఐ లాండ్ లో గర్ల్స్ ట్రిప్ రీయూనియన్ అంటూ నికిషా రాసుకొచ్చింది. ఇందులో ఒక ఫోటోలో ఛార్మీకి త్రిష ముద్దు పెడుతూ కనిపించింది. దాదాపు 20 ఏళ్ల క్రితం వీరిద్దరు పౌర్ణమి సినిమాలో నటించారు.

పౌర్ణమి సినిమాలో త్రిష, ఛార్మీ ఇద్దరు అక్కా చెల్లెళ్లుగా నటించారు. అలాగే నికిషా సైతం తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. పవర్ పవన్ కళ్యాణ్ నటించిన కొమురం పులి సినిమాలో నటించింది. ఆ తర్వాత ఆమె సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ నెట్టింట మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది

ఇప్పుడు త్రిష, ఛార్మీ, నికిషా ముగ్గురు దుబాయ్ వేదికగా రీయూనియన్ పార్టీ జరుపుకున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ఛార్మీ నిర్మాణ రంగంలో సెటిల్ కాగా.. త్రిష మాత్రం వరుస సినిమాలతో అలరిస్తుంది. అలాగే నికిషా కూడా సినిమాలకు దూరంగా ఉంటుంది.