
అయలాన్ ప్రీ రిలీజ్: శివకార్తికేయన్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా రవికుమార్ తెరకెక్కించిన సినిమా అయలాన్. జనవరి 12న తమిళంలో విడుదలైన ఈ సినిమాకు మంచి స్పందన వచ్చింది. జనవరి 26న తెలుగులో విడుదల చేస్తున్నారు. అయలాన్ తెలుగు వర్షన్‌ను దిల్ రాజు విడుదల చేస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక జరిగింది. దీనికి చిత్ర యూనిట్ అంతా హాజరయ్యారు.

అలనాటి రామచంద్రుడు: కృష్ణవంశీ, మోక్ష జంటగా నటిస్తున్న చిత్రం ‘అలనాటి రామచంద్రుడు’. చిలుకూరి ఆకాష్ రెడ్డి దర్శకుడు. ఈ చిత్ర టీజర్‌ను ప్రముఖ నిర్మాత దిల్ రాజు చేతుల మీదుగా విడుదల చేశారు. దర్శకుడు ఆకాశ్ మాట్లాుడతూ సున్నితమైన భావోద్వేగాలతో సాగే ప్రేమకథా చిత్రమిది.. కుటుంబ అనుబంధాల గొప్పతనాన్ని ఆవిష్కరిస్తూ సాగుతుందని తెలిపారు.

లవ్ & వార్: గంగూభాయ్ కతియావాడి తర్వాత సంజయ్ లీలా భన్సాలీ మరో సినిమాను ప్రకటించలేదు. తాజాగా రణ్‌బీర్ కపూర్, విక్కీ కౌశల్ హీరోలుగా.. అలియా హీరోయిన్‌గా లవ్ అండ్ వార్ సినిమాను ప్రకటించారీయన. గతంలో రణ్‌వీర్, దీపికతో వరస సినిమాలు చేసిన భన్సాలీ.. ఇప్పుడు అలియాను రిపీట్ చేస్తున్నారు. అలాగే 2007లో సావరియాతో రణ్‌బీర్ కపూర్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేసింది భన్సాలీనే. ఇన్నేళ్ళ తర్వాత మళ్లీ రణ్‌బీర్‌తో సినిమా చేస్తున్నారు.

బడేమియా ఛోటేమియా.: అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ హీరోలుగా అలీ అబ్బాస్ జాఫర్ తెరకెక్కిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ బడేమియ ఛోటేమియా. తాజాగా ఈ చిత్ర టీజర్ విడుదల చేసారు దర్శక నిర్మాతలు. ఎప్రిల్ 10న సినిమా విడుదల కానుంది. టీజర్ పూర్తిగా యాక్షన్‌తో నిండిపోయింది. ఈ సినిమాతో పెద్ద విజయం అందుకుంటానని ధీమాగా ఉన్నారు అక్షయ్ కుమార్.

మిస్టర్ బచ్చన్ వచ్చేస్తున్నాడు..: రవితేజ హీరోగా హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న సినిమా మిస్టర్ బచ్చన్. ఈ చిత్ర షూటింగ్ వేగంగా జరుగుతుంది. తాజాగా దీని కొత్త షెడ్యూల్ కరైకూడిలో జరగనుంది. దీనికోసం అక్కడికి వెళ్లారు హీరో రవితేజ, దర్శకుడు హరీష్ శంకర్. వీలైనంత త్వరగా సినిమాను పూర్తి చేసి సమ్మర్‌లో విడుదల చేయాలని చూస్తున్నారు దర్శక నిర్మాతలు.