
సీనియర్ హీరోయిన్స్ కెరీర్ పై ఫోకస్ చేశారు. ఎప్పుడూ వెళ్లే రూట్‌లో కాకుండా, కాస్త కొత్తగా తమ అభిమానులను ఎంటర్ టైన్ చేయాలి అని, యాక్షన్ సినిమాల వైపు మొగ్గు చూపుతున్నారు. సమంత నుంచి నయన్, త్రిష వరకు అందరూ ఇదే బాటలో వెళ్తున్నారు.

ఈ మధ్య సినిమాల విషయంలో సెలెక్టివ్‌గా ఉంటున్న సమంత ఎక్కువగా యాక్షన్ రోల్స్ మీదే కాన్సన్‌ట్రేట్ చేస్తున్నారు. వరుసగా ఓటీటీలో యాక్షన్ ప్రాజెక్ట్స్‌లో కనిపించిన ఈ బ్యూటీ, బిగ్ స్క్రీన్ మీద కూడా అదే ట్రెండ్ కంటిన్యూ చేస్తున్నారు. మా ఇంటి బంగారం మూవీలో యాక్షన్ అవతార్‌లో కనిపించబోతున్నారు.

క్లాస్ మాస్‌ను పర్ఫెక్ట్‌గా బ్యాలెన్స్ చేస్తున్నారు లేడీ సూపర్ స్టార్ నయనతార. ఓ వైపు స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్‌గా నటిస్తూనే మరో వైపు లేడీ ఓరియంటెడ్ సబ్జెక్ట్స్‌తో దుమ్మురేపుతున్నారు. రీసెంట్‌గా మన శంకరవరప్రసాద్‌గారితో కలిసి సూపర్ హిట్ అందుకున్న నయన్, త్వరలో రాక్కాయిగా యాక్షన్ లుక్‌లో కనిపించబోతున్నారు.

పాన్ ఇండియా బ్లాక్ బస్టర్స్‌తో నేషనల్ లెవల్‌లో నెంబర్ వన్ రేసులో ఉన్న రష్మిక కూడా యాక్షన్ మూవీస్ మీద కాన్సన్‌ట్రేట్ చేస్తున్నారు. రీసెంట్‌గా గర్ల్‌ఫ్రెండ్ లాంటి ఎమోషనల్ డ్రామాతో మెప్పించిన ఈ బ్యూటీ నెక్ట్స్ మైసాతో యాక్షన్ హీరోయిన్‌గానూ ప్రూవ్ చేసుకునే పనిలో ఉన్నారు.

ఇప్పటికే కమర్షియల్ ట్రెండ్‌కు దూరమైన త్రిష, తమన్నా, కాజల్ లాంటి బ్యూటీస్ కూడా ఎక్కువగా యాక్షన్, లేడీ ఓరియంటెడ్ సబ్జెక్ట్స్ వైపే చూస్తున్నారు. అయితే బిగ్ స్క్రీన్ మీద, లేదంటే ఓటీటీలో డిఫరెంట్ సబ్జెక్ట్స్‌తో గ్లామర్ వరల్డ్‌లో గ్యాప్ రాకుండా చూసుకుంటున్నారు.