Rajeev Rayala |
May 20, 2022 | 6:05 AM
నందమూరి తారక రామారావు(Jr.NTR).. పుటిన రోజు నేడు. నటనతో, డ్యాన్స్ లతో అంతులేని అభిమానులను సొంతం చేసుకున్నారు ఎన్టీఆర్.
ఎన్టీఆర్ కు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంత కాదు. 1991లో వచ్చిన బ్రహ్మర్శి విశ్వామిత్ర సినిమాతో సినీ ఎంట్రీ ఇచ్చాడు తారక్. అప్పటికీ ఎన్టీఆర్ వయసు ఎనిమిదేళ్లు మాత్రమే .
ఆ తర్వాత 1996లో బాల రామాయణం అనే మరో సినిమాలోనూ ఎన్టీఆర్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించాడు.
18 ఏళ్ల వయసులో 2001లో సోలో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు నిన్ను చూడాలని ఉంది సినిమాతో హీరోగాపరిచయం అయ్యాడు.
రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన స్టూడెంట్ నంబర్ 1 సినిమాతో మొదటి హిట్ అందుకున్నాడు. ఆతర్వాత 2002లో వీవీ వినాయక్ దర్శకత్వంలో వచ్చిన 'ఆది' సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.
ఇక రాజమౌళి తెరకెక్కించిన సింహాద్రి సినిమాతో మరో సూపర్ హిట్ అందుకున్నాడు తారక్. ఆతర్వాత కొన్ని ఫ్లాప్ తర్వాత 2007లో యమదొంగతో ఎన్టీఆర్ మరో బ్లాక్ బస్టర్ హిట్ ను కొట్టాడు తారక్.
ఆతర్వాత బృందావనం, అదుర్స్, బాద్షా, టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జై లవ కుశ, అరవింద సమేత సినిమాలతో హిట్స్ కొట్టాడు.
రీసెంట్ గా ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకున్నాడు ఎన్టీఆర్. తాజాగా పుట్టిన రోజు సందర్భంగా కొరటాల శివతో తన 30వ సినిమాను అనౌన్స్ చేశాడు