Rajitha Chanti |
Mar 26, 2021 | 4:54 PM
గత కొద్ది రోజులుగా తెలుగు తెరకు దూరంగా ఉన్న ఈ అమ్మడు.. అటు తమిళ పరిశ్రమలో వరుస సినిమాలతో ఫుల్ బిజీగా మారిపోయింది.
తాజాగా ఈ ముద్దుగుమ్మ తన అన్నయ్య ప్రశాంత్ మోత్నానీకి.. టెలివిజన్ నటి ముస్కాన్ నాన్సీతో మార్చి 22న వివాహం జరిగింది.
కరోనా నేపథ్యంలో అతి కొద్ది బంధువులు, సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం జరిగింది.
ఇక తన అన్నయ్య పెళ్లి వేడుకలలో హన్సిక కుందనపు బొమ్మలా కనిపించింది. బంగారపు వర్ణపు లెహాంగాలో .. తన సోదరుడిని ఆటపట్టిస్తూ కనిపించింది.
ప్రస్తుతం హన్సిక లేడీ ఓరియెంటెడ్ సినిమాగా తెరకెక్కుతున్న 'మహా'లో నటిస్తుంది. ఇందులో తమిళ నటుడు ప్రతినాయకుడుగా చేస్తున్నాడు.
అంతేకాకుండా ఈ సినిమాలో శింబు ఓ కీలక పాత్రలో నటించనున్నాడు. జమీల్ దర్శకత్వంలో ఎక్స్ట్రా ఎంటర్ టైన్మెంట్ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.
ఇప్పటివరకు తెలుగులో అగ్రహీరోలందరితో హన్సిక నటించి మెప్పించింది. ప్రస్తుతం కోలీవుడ్‌లోనే ఈ ముద్దు గుమ్మకు ఎక్కువ అవకాశాలు వస్తుండడంతో ఈ మధ్య తెలుగు తెరపై పెద్దగా కనిపించడం లేదు.
హన్సిక నివాసంలో మార్చి 21న ఎంగేజ్‌మెంట్‌తో మొదలైన ఈ సంబరాలు.. ఇటీవలే పెళ్లి వేడుకతో ముగిసాయి. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.