
ఆల్రెడీ దసరాతో మాస్ ఇమేజ్ తెచ్చుకున్న నాని, ఈ మూవీతో ప్యాన్ ఇండియా మార్కెట్ మీద గట్టిగానే దండయాత్ర చేయాలని సిద్ధమవుతున్నారు. ప్రమోషనల్ కంటెంట్‌లో చూపించినంత వైవిద్యం, మూవీ కంటెంట్‌లోనూ ఉంటే హిట్ పక్కా అంటున్నారు క్రిటిక్స్.

నాని హీరోగా తెరకెక్కిన మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ దసరా. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. దీంతో ఇదే కాంబినేషన్‌ను మరోసారి రిపీట్ చేస్తున్నారు నాని. అంతేకాదు నెక్ట్స్ మూవీ బడ్జెట్‌ను దసరా వసూళ్ల కంటె ఎక్కువగా ఫిక్స్ చేశారు మేకర్స్.

నాని మాత్రమే కాదు మంచు విష్ణు కూడా ఇలాంటి రిస్కే చేస్తున్నారు. విష్ణు బ్లాక్ బస్టర్ హిట్ చూసి చాలా రోజులవుతోంది. అయినా తన మార్కెట్ లెక్కలు పట్టించుకోకుండా భారీ బడ్జెట్‌తో కన్నప్ప సినిమాను రూపొందిస్తున్నారు. పాన్ ఇండియా స్టార్స్, బిగ్ టెక్నికల్ వాల్యూస్‌తో సినిమా తెరకెక్కించేందుకు చాలా ఖర్చు చేస్తున్నారు.

సినిమా సినిమాకీ మధ్య కాస్త గ్యాప్ ఉన్నా సరే ఏం ఫర్వాలేదని అనుకుంటున్నారు ఈ మెగా మేనల్లుడు. ఆ సమయాన్ని స్క్రిప్ట్ మీద మరింత గ్రిప్ కోసం వాడుకుంటున్నారు.

రీసెంట్‌గా సుదీర్ బాబు కూడా ఓ పాన్ ఇండియా సినిమాను ఎనౌన్స్ చేశారు. మాస్ యాక్షన్ జానర్‌లో చేస్తున్న ఈ సినిమా కోసం భారీ బడ్జెట్‌ను ఫిక్స్ చేశారు. ఇలా యంగ్ హీరోల సినిమాలకు ప్రీవియస్ మూవీస్ వసూళ్లను దాటి బడ్జెట్ కేటాయించటం ఇండస్ట్రీ సర్కిల్స్‌లోనూ హాట్ టాపిక్ అవుతోంది.