
సిల్వర్ స్క్రీన్ మీద ట్రెండ్స్ మారుతూ ఉంటాయి. ఓ ఇరవై ఏళ్ల కింద సిల్వర్ స్క్రీన్‌ను రూల్ చేసిన జానర్స్ మళ్లీ రిపీట్ అవుతుంటాయి. అప్పట్లో కాసులు కురిపించిన ఫార్ములాస్ మళ్లీ తెర మీదకొస్తుంటాయి. ప్రజెంట్ అలాంటి ఓ క్రేజీ ట్రెండ్ మరోసారి బిగ్ స్క్రీన్ మీద సందడి చేస్తోంది...? ఈ ట్రెండ్‌తో అభిమానులు కూడా డబుల్ హ్యాపీగా ఉన్నారు.

చిరు - అనిల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మెగా 157లో మెగాస్టార్ డ్యూయల్ రోల్‌లో కనిపించబోతున్నారు. ఒక క్యారెక్టర్ అనిల్ మార్క్ కామెడీ జానర్‌లో ఎంటర్‌టైన్ చేస్తే, మరో క్యారెక్టర్ చిరు స్టైల్ యాక్షన్ మోడ్‌లో ఉండబోతుందట. ఈ అప్‌డేట్‌తో మెగా ఫ్యాన్స్ డబుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.

రీసెంట్ టైమ్స్‌లో సిల్వర్ స్క్రీన్ మీద మల్టీ రోల్స్ ట్రెండ్ గట్టిగా కనిపిస్తోంది. అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కబోయే గ్లోబల్ మూవీలో బన్నీ ట్రిపుల్ రోల్ చేయబోతున్నారు. ఈ జనరేషన్‌లో ట్రిపుల్ యాక్షన్ చేస్తున్న తొలి హీరోగా రికార్డ్ సెట్ చేయబోతున్నారు ఐకాన్ స్టార్.

రీసెంట్‌గా దేవర సినిమాలో డ్యూయల్ రోల్‌లో నటించారు ఎన్టీఆర్. తండ్రి కొడుకులగా నటించిన తారక్, తొలి భాగంలో ఒకే ఫ్రేమ్‌లో రెండు రోల్స్‌లో కనిపించకపోయినా.. దేవర 2లో ఇద్దరు ఒకే ఫ్రేమ్‌లో కనిపించే ఛాన్స్ ఉందన్న టాక్ వినిపిస్తోంది.

డార్లింగ్ ప్రభాస్ కూడా డబుల్ బొనాంజ ప్లాన్ చేస్తున్నారు. ది రాజాసాబ్ సినిమాలో రెండు డిఫరెంట్ రోల్స్‌లో కనిపించబోతున్నారు. ఒక క్యారెక్టర్‌లో స్టైలిష్ లుక్ లో అదరగొడితే.. మరో లుక్‌లో ఓల్డేజ్ రాయల్ ఎటైర్‌లో భయపెడుతున్నారు. ఇలా స్టార్ హీరోలంతా ఫ్యాన్స్‌కు డబుల్ జోష్ ఇచ్చేందుకు కష్టపడుతున్నారు.