
ప్రస్తుతం వరస బ్లాక్ బస్టర్ మూవీస్‌తో ఫుల్ జోష్‌లో ఉన్న ముద్దుగుమ్మ రష్మిక మందన్న. ఈ అమ్మడు 2026లో మైసా అనే సినిమాతో అభిమానుల మనసు దోచుకోనుంది. అంతే కాకుండా ఈ బ్యూటీ వచ్చే సంవత్సరంలో విజయ్ దేవరకొండతో వివాహం చేసుకునే ఛాన్స్ కూడా ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.

టాలీవుడ్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్న ముద్దుగుమ్మల్లో శ్రీలీల కూడా ఒకరు. ఈ అమ్మడు 2026లో రెండు సినిమాలతో థియేటర్లో సందడి చేయనున్నది. పరాశక్తి, ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలతో అభిమానుల ముందుకు రానున్నది.

స్టార్ బ్యూటీ నయనతార 2026లో 8 సినిమాలతో సందడి చేయనున్నది. డియర్ స్టూడెంట్స్, మన్ శంకర్ వర ప్రసాద్ గారు, టాక్సిక్ : ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్, మన్నన్ గట్టి సిన్స్ 1960, పేట్రియాట్ సినిమాలతో తన అభిమానుల ముందుకు రానున్నది.

ఇక అందాల చిన్నది పూజా హెగ్దే లాంగ్ గ్యాప్ తర్వాత 2026 సంవత్సరంలో ఏకంగా మూడు సినిమాలతో సందడి చేయనుంది. కాంచన 4, జన నాయగన్ తో పాటు ఇంకో సినిమాతో అభిమానుల ముందుకు రానున్నదంట. మరి ఈ సంవత్సరం అయినా ఈ చిన్నదానికి కలిసివస్తుందో లేదో చూడాల్సిందే అంటున్నారు సినీ వర్గాలు.

అందాల చిన్నది అనుష్క గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ బ్యూటీ తెలుగు చిత్రపరిశ్రమకు దూరమైంది. అయితే ఈ చిన్నది 2026వ సంవత్సరంలో ఒక సినిమాతో అభిమానుల ముందుకు రానుంది. అలాగే సీనియర్ బ్యూటీ త్రిష ఈ మధ్య జోర్ పెంచింది. ఈ చిన్నది మూడు సినిమాలతో సందడి చేయనున్నదంట.