Rajeev Rayala |
Jul 19, 2024 | 2:04 PM
నభానటేష్ ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీగా మారింది. నన్ను దోచుకుందువటే సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన ఈ ముద్దుగుమ్మ వరుస సినిమాలతో ఆకట్టుకుంది. తొలి సినిమాతోనే నటిగా మంచి మార్కులు కొట్టేసింది ఈ చిన్నది.
ఆతర్వాత పూరిజగన్నాథ్ దర్శకత్వం వహించిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో ఈ బ్యూటీ సూపర్ హిట్ అందుకుంది. ఈ సినిమాలో తన నటనతో ప్రేక్షకులను అలరించింది. ఈ సినిమాలో తన అందంతోనూ మెప్పించింది ఈ ,ముద్దుగుమ్మ.
ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత వరుసగా సినిమాలు చేసిన నాభా నటేష్ కు ఆతర్వాత ఆశించిన స్థాయిలో సక్సెస్ దక్కలేదు. దాంతో మెల్లగా ఈ అమ్మడికి ఆఫర్స్ తగ్గాయి. ఒక్క హిట్ కొడితే తిరిగి ట్రాక్ లోకి వస్తుంది అనుకునేలోగా ప్రమాదానికి గురైంది.
ప్రమాదం కారణంగా సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. ఇక ఇప్పుడు కోలుకొని సినిమాలు చేస్తుంది. తాజాగా డార్లింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందు వచ్చింది. అయితే సోషల్ మీడియాలో ఈ బ్యూటీ చాలా యాక్టివ్ గా ఉంటుంది.
తాజాగా నభా నటేష్ కొన్ని క్రేజీ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది. ఈ ఫోటోలు అభిమానులను అలరిస్తున్నాయి. ఈ ఫొటోల్లో నభా తన అందాలతో కవ్వించింది. ఈ బ్యూటీ అందాన్ని పొగుడుతూ.. కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.