
ప్రస్తుతం వేసవి సెలవులు కావడంతో సెలబ్రిటీలందరూ టూర్‌లు, వెకేషన్స్ అంటూ విదేశాలకు వెళుతున్నారు. మరికొందరేమో ఆధ్యాత్మిక యాత్ర బాట పట్టారు.

తాజాగా టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ ఐశ్వర్యా రాజేష్ అస్సాంలోని కామాఖ్య అమ్మవారి టెంపుల్ కి వెళ్లింది. తన స్నేహితులతో కలిసి ఈ అక్కడ ప్రత్యేక పూజలు చేసింది.

అనంతరం తన ఆధ్యాత్మిక యాత్రలకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. 'జై మా కామాఖ్య' అంటూ వీటికి క్యాప్షన్ ఇచ్చింది.

ప్రస్తుతం ఐశ్వర్యా రాజేష్ షేర్ చేసిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. వీటిని చూసిన సినీ అభిమానులు, నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

కాగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిందీ అందాల తార. ఈ మూవీలో భాగ్యంగా ఐశ్వర్య అభినయం అందరినీ ఆకట్టుకుంది.