Cinema OTT: కేవలం నలుగురు మనుషులు.. ప్రతి సీన్ భయానకం.. ఈఓటీటీలో ఈ థ్రిల్లర్ మూవీ సంచలనం..

Updated on: Jul 25, 2026 | 4:23 PM

వారం వారం ఓటీటీలోకి కొత్త కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ విడుదలవుతున్న సంగతి తెలిసిందే. సస్పెన్స్, థ్రిల్లర్, హారర్, రొమాంటిక్ వంటి జానర్ చిత్రాలు దూసుకుపోతున్నాయి. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఒక సినిమా ఓటీటీలో దుమ్మురేపుతుంది. ఆ చిత్రాన్ని చూసేందుకు జనాలు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ఇంతకీ ఆ సినిమా ఏంటంటే.

1 / 5
ప్రస్తుతం ఓటీటీలో ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ దూసుకుపోతుంది. సినిమా కథ విషయానికి వస్తే.. అది 17వ శతాబ్దం. దేవన్ (అర్జున్ అశోకన్) కేరళలోని దక్షిణ మలబార్ అటవీ ప్రాంతంలో దారి తప్పిపోతాడు. అక్కడ అతను ఒక ఇంట్లో ఆశ్రయం పొందుతాడు. ఆ ఇల్లు కోడుమన్ పొట్టి (మమ్ముట్టి)కి చెందినది. అతను ఇంట్లోకి అడుగుపెట్టిన మొదటి రోజే కథ మొదలవుతుంది. ఎన్నో రహస్యమైన సంఘటనలు జరుగుతాయి. అతనికి ఏమీ అర్థం కాదు.

2 / 5
ఇది సరిగ్గా లేదని దేవాన్ భావించి వెళ్ళిపోవాలనుకుంటాడు. కానీ అతను వెళ్ళలేకపోతాడు. రోజులు గడిచిపోతాయి. ఆ రహస్యమైన ఇంటి నుండి తప్పించుకోవడానికి అతను చేసే ప్రయత్నాలు విఫలమవుతాయి. ఆ ఇంట్లో ఏం జరుగుతోంది..? దేవాన్ చివరికి అక్కడి నుండి తప్పించుకున్నాడా? లేదా? ఇదే  ఈ మలయాళ సినిమా కథ. మనం మాట్లాడుకుంటున్న సినిమా పేరు 'బ్రహ్మయుగం'

3 / 5
 'బ్రహ్మయుగం' అనేది రాహుల్ సదాశివం దర్శకత్వంలో మమ్ముట్టి నటించిన ఒక మలయాళ చిత్రం, ఇది 2024లో విడుదలైంది. ఈ చిత్రం సోనీ లివ్ ఓటీటీలో అందుబాటులో ఉంది. మీరు ఈ చిత్రాన్ని తమిళంలో కూడా చూడవచ్చు. ఒక్క బోరింగ్ సన్నివేశం కూడా లేకుండా ఇది మనల్ని దక్షిణ మలబార్‌కు తీసుకెళ్తుంది. ఆ ఇంట్లో జరిగే రహస్యాలు, మమ్ముట్టి గంభీరమైన రూపం, నేపథ్య సంగీతం మనల్ని సినిమాలోకి లాగేస్తాయి.

4 / 5

5 / 5
ఈ చిత్రం పూర్తిగా బ్లాక్ అండ్ వైట్ (నలుపు-తెలుపు) ఫార్మాట్‌లో రూపొందడం దీని ప్రత్యేకత.  కొడుమోన్ పొట్టిగా మమ్ముట్టి కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. విలనిజం, భయానక నవ్వుతో ప్రేక్షకులను భయపెట్టాడు.  2026లో లాస్ ఏంజిల్స్‌లోని ప్రతిష్టాత్మక అకాడమీ మ్యూజియం ఆఫ్ మోషన్ పిక్చర్స్‌లో ప్రత్యేక స్క్రీనింగ్ కోసం ఈ చిత్రం ఎంపికైంది. ప్రస్తుతం ఓటీటీలోట్రెండ్ అవుతుంది.

Follow Us