Tollywood: ఈ ఏడాది నెట్‏ఫ్లిక్స్‏లో రిలీజ్ అయ్యే సినిమాలు ఇవే.. సలార్, దేవర టూ పుష్ప 2 వరకు..

|

Jan 16, 2024 | 12:01 PM

ఈ ఏడాది తెలుగు ప్రేక్షకులకు మరింత వినోదాన్ని అందించేందుకు సిద్ధమయ్యింది ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం నెట్ ఫ్లిక్స్. ఇప్పటివరకు ఎన్నో సినిమాలతో అలరించిన ఈ సంస్థ.. ఈ ఏడాది స్టార్ హీరోల భారీ బడ్జెట్ సినిమాలతోపాటు.. యంగ్ హీరోల చిత్రాలను స్ట్రీమింగ్ చేసేందుకు రెడీ అయ్యింది. తాజాగా నెట్ ఫ్లిక్స్ పండగ పేరుతో పోస్టర్స్ రిలీజ్ చేసింది.

1 / 8
 డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సినిమా సలార్. పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు, శ్రుతిహాసన్ కీలకపాత్రలలో నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సెన్సెషన్ సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఇప్పుడు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో నెట్‏ఫ్లిక్స్‏లో స్ట్రీమింగ్ కానుంది. డేట్ ఇంకా వెల్లడించలేదు.

2 / 8
మాస్ డైరెక్టర్ కొరటాల శివ, ఎన్టీఆర్ కాంబోలో వస్తున్న సినిమా దేవర. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ 5న విడుదల కానుంది ఈ మూవీ. అలాగే థియేట్రికల్ రన్ ముగిసిన తర్వాత తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీలో నెట్‏ఫ్లిక్స్‏లో సందడి చేయనుంది.

3 / 8
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న పుష్ప 2పై ఓ రేంజ్ హైప్ నెలకొంది. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈసినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా ఆగస్ట్ 15న విడుదల కానుంది. ఆ తర్వాత నెట్‏ఫ్లిక్స్‏లో స్ట్రీమింగ్ కానుంది.

4 / 8
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటిస్తోన్న లేటేస్ట్ మూవీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. కృష్ణ చైతన్య రూపొందిస్తున్న ఈ సినిమాలో నేహా శెట్టి కథానాయికగా నటిస్తుంది. షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా మార్చి 8న విడుదల కానుంది. ఆ తర్వాత తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఈ సినిమా నెట్‏ఫ్లిక్స్‏లో స్ట్రీమింగ్ కానుంది.

5 / 8
 సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న సినిమా టిల్లు స్వేర్. గతంలో సూపర్ హిట్ అయిన డీజే టిల్లు సినిమాకు సీక్వెల్  ఇది. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, గ్లింప్స్ ఆకట్టుకున్నాయి. ఈ సినిమా తర్వలోనే థియేటర్లలోకి రానుంది.

6 / 8
విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తున్న సినిమాకు ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు. ప్రస్తుతం వీడి 12 వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈసినిమాలో శ్రీలీల కథానాయికగ. త్వరలోనే ఈ సినిమా అడియన్స్ ముందుకు రానుంది. తెలుగు సహా ఐదు భాషల్లో నెట్‏ఫ్లిక్స్‏లో స్ట్రీమింగ్ కానుంది.

7 / 8
వాల్తేరు వీరయ్య సినిమా తర్వాత డైరెక్టర్ బాబీ  తెరకెక్కిస్తున్న సినిమా NBK 109. నందమూరి హీరో బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా టైటిల్, నటీనటుల వివరాలు వెల్లడించలేదు. ఈ మూవీ సైతం నెట్‏ఫ్లిక్స్‏ వేదికగా స్ట్రీమింగ్ కానుంది.

8 / 8
అల్లు శిరీష్ ప్రధాన పాత్రలో సామ్ ఆంటోన్ తెరకెక్కిస్తున్న చిత్రం బడ్డీ. ఇందులో గాయత్రి భరద్వాజ్, గోకుల్ కీలకపాత్రలలో నటిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ నెట్‏ఫ్లిక్స్‏లో స్ట్రీమింగ్ కానుంది. అలాగే కార్తికేయ గుమ్మకొండ, సిద్ధు జొన్నలగడ్డ సినిమాలు నెట్‏ఫ్లిక్స్‏లో స్ట్రీమింగ్ కానున్నాయి.