
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చిరు సినిమా కోసం అభిమానులందరూ ఎంతగానో ఎదురు చూస్తారు. కానీ 2025లో ఈ హీరో ఒక్క సినిమా కూడా రిలీజ్ చేయలేదు. 2023న భోళా శంకర్ రిలీజ్ అయ్యింది. ఈ మూవీ తర్వాత ఈ హీరో విశ్వంభర మూవీ 2025లో విడుదల అవుతుందని అభిమానులు ఆశగా ఎదురు చూశారు కానీ, ఈ మూవీ కూడా రిలీజ్ అవ్వలేదు.ఈ మూవీ 2026లో విడుదల కానున్నట్లు సమాచారం.

అలాగే మహేష్ బాబు ఫ్యాన్స్ , ఈ హీరో సినిమా కోసం ఎంతగానో వేయిట్ చేస్తుంటారు. అయితే ప్రస్తుతం మహేష్ బాబు, రాజమౌళి దర్శకత్వంలో ఎస్ ఎస్ ఎమ్‌బ మూవీ చేస్తున్నారు, ఈ మూవీ 2027లో రిలీజ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉన్నట్లు తెలుస్తుంది. అలా 2025లో మహేష్ బాబు అభిమానులకు నిరాశే మిగిలింది.

పాన్ ఇండియా లెవల్‌లో సత్తా చాటుతున్న హీరో ప్రభాస్, ఈయన కల్కి సినిమా తర్వాత మరో సినిమా రిలీజ్ చేయలేదు. ప్రస్తుతం ఈ హీరో ది రాజా సాబ్ మూవీతో అభిమానుల ముందుకు రానున్నారు. ఇలా 2025లో ప్రభాస్ ఒక్క సినిమా కూడా థియేటర్లో సందడి చేయలేదు.

టాలీవుడ్ మన్మథుడు నాగార్జున గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ హీరో కూడా 2025 మిస్ అయ్యారనే చెప్పాలి. ఈ సంవత్సరంలో సోలోగా నాగార్జున మూవీ ఒక్కటి కూడా రిలీజ్ కాలేదు.కుభేర మూవీలో ఈయన ధనుష్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు.

జూనియర్ ఎన్టీఆర్ కూడా 2025లో తన అభిమానులకు నిరాశనే మిగుల్చాడు. దేవర తర్వాత ఈ హీరో ఒక్క సినిమాను కూడా 2025లో విడుదల చేయలేదు. ప్రస్తుతం ఈయన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.