
సంక్రాంతి నుంచి షిఫ్ట్ అయిన విశ్వంభర నెక్స్ట్ సమ్మర్‌కి సాలిడ్ ట్రీట్ ఇవ్వడం పక్కా అనేది మెగా ఫ్యాన్స్ సర్కిల్స్ లో హల్‌చల్ చేస్తున్న న్యూస్. సమ్మర్‌కి ఎలాగూ పవర్‌స్టార్ హరిహరవీరమల్లు రెడీ అవుతోంది. సో డబుల్ ట్రీట్ రెడీ అవుతోందన్నమాట.

నెక్స్ట్ సమ్మర్ డేట్‌ని అందరికన్నా ముందు పెద్ద ఖర్చీఫ్ వేసి రిజర్వ్ చేసుకున్నారు రాకీభాయ్ యష్. ఆయన నటించిన టాక్సిక్‌ని వచ్చే ఏడాది ఏప్రిల్ 10న విడుదల చేయనున్నట్టు అనౌన్స్ చేశారు. కేజీయఫ్ సీక్వెల్ తర్వాత చేస్తున్న సినిమా కావడంతో టాక్సిక్ మీద అంచనాలు బాగానే ఉన్నాయి. ప్యాన్ ఇండియా రేంజ్‌లో ఈ సినిమా ఉందని తెలిసినా, కాన్ఫిడెంట్‌గా అదే డేట్‌కి షిఫ్ట్ అయ్యారు రాజా సాబ్.

రాజా సాబ్‌ని వచ్చే ఏడాది ఏప్రిల్ 10న విడుదల చేయడానికి రెడీ అవుతున్నారు డార్లింగ్ ప్రభాస్. ఆల్రెడీ షూటింగ్ దాదాపుగా పూర్తి కావచ్చిందన్నది న్యూస్. ఇప్పటికే విడుదలైన టీజర్, మోషన్ పోస్టర్స్ ఆకట్టుకున్నాయి.

రాజా సాబ్‌తో పోటీకి దిగడానికి ధనుష్ కూడా సై అంటున్నారు. ధనుష్, నిత్యామీనన్ కలిసి నటించిన తిరుచిత్రంబలం ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. ఇప్పుడు ఇదే కాంబోలో వస్తున్న ఇడ్లీ కడై కోసం ఏప్రిల్ 10ని టార్గెట్ చేశారట మేకర్స్.

ఈ సినిమాలు వచ్చిన వారం రోజుల తర్వాత అంటే ఏప్రిల్ 18న రావడానికి రెడీ అంటున్నారు తేజ సజ్జా. ఈ ఏడాది సంక్రాంతికి భారీ హీరోలతో తలపడి హనుమాన్‌తో సక్సెస్ కొట్టారు తేజ సజ్జా. ఈ మూవీ ఇచ్చిన కాన్ఫిడెన్స్ తో వచ్చే ఏడాది సమ్మర్ సీజన్ మీద కాన్‌సెన్‌ట్రేట్ చేస్తున్నారు. ప్రస్తుతానికి ఏప్రిల్ 18 న తేజ సోలోగానే ఉన్నారు. మరి ఇంకే సినిమాలైనా ఆ డేట్ మీద దృష్టి పెడితే మాత్రం పోటీ తప్పదు....