
అదాశర్మ కీలక పాత్రలో నటించిన తాజా చిత్రం ది కేరళ స్టోరీ. లవ్ జిహాద్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా మే5న విడుదలైంది.

క ముగ్గురు యువతులను మతం మార్చి ఐసిస్ వంటి ఉగ్రవాద సంస్థ కోసం పని చేసేందుకు ఎలా దేశాలు దాటించారు అనే కథ ఆధారంగా చేసుకుని సుదీప్తో సేన్ ఈ సినిమాను తెరకెక్కించారు.

The Kerala Story

ప్రస్తుతం పంజాగుట్ట పీవీఆర్ మాల్ లో, జీవీకే వన్ ఐనాక్స్ మాల్ లో, ఎర్రమంజిల్ పివిఆర్ మాల్ లో, ప్రసాద్ ఐమాక్స్ లో, సికింద్రాబాద్లోని టివోలీ సినిమా థియేటర్స్ లో, ఇనార్బిట్ మాల్ పివిఆర్ థియేటర్లో, ముక్తా ఏ2 సినిమాస్ థియేటర్లో, ఏషియన్ తారకరామా సినీ ఫ్లెక్స్ లో, కాచిగూడ ఐనాక్స్ మాల్ లో ది కేరళ స్టోరీ సినిమాను ప్రదర్శిస్తున్నారు.

'ది కేరళ స్టోరీ’ సినిమా తర్వాత హీరోయిన్ అదా శర్మ ఓ పోలీస్ పాత్రలో కనిపించనున్నారు. ‘హేట్ స్టోరీ 2’ ఫేమ్ విశాల్ పాండ్య దర్శకత్వంలో శ్రేయాస్ తల్పాడే హీరోగా నటిస్తున్న చిత్రం ‘ది గేమ్ ఆఫ్ గిర్జిట్’. ఈ చిత్రంలో అదా శర్మ హీరోయిన్‌గా ఎంపికైంది.