Samatha J |
Jan 12, 2025 | 12:41 PM
ఇండస్ట్రీలోనూ అంతే.. అందుకే బాలయ్యతో కొందరు దర్శకులు, సంగీత దర్శకులు, హీరోయిన్లు అలా రిపీట్ అవుతూనే ఉంటారు. అలా ఈ మధ్య బాలయ్యకు బాగా కనెక్ట్ అయిన మ్యూజిక్ డైరెక్టర్ తమన్. NBK సినిమా అంటే చాలు.. పోస్టర్‌పై తమన్ పేరు కనిపిస్తుంది.
అఖండ నుంచి ఈ ఇద్దరి బాండింగ్ మరింత బలంగా మారింది. 2016లో డిక్టేటర్ సినిమాకు బాలయ్యతో తొలిసారి వర్క్ చేసాడు తమన్. ఆ తర్వాత మళ్లీ గ్యాప్ వచ్చింది.
అయితే 2021లో బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్‌లో వచ్చిన 'అఖండ' సినిమాకు తమన్ ఇచ్చిన సంగీతం నెక్ట్స్ లెవల్ అంతే. అందులో తమన్ మ్యూజిక్‌కు బాక్సులు బద్ధలైపోయాయి. అలాగే వీరసింహారెడ్డి సినిమాలోనూ అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చాడు తమన్. ఇందులో కూడా రీ రికార్డింగ్ నెక్ట్స్ లెవల్‌లో ఉంటుంది.
2023లోనే భగవంత్ కేసరితో బాలయ్యకు హ్యాట్రిక్ ఆల్బమ్ ఇచ్చాడు తమన్. ఇక తాజాగా విడుదలైన డాకు మహారాజ్‌లోనూ అదే మ్యాజిక్ చేస్తున్నాడు తమన్. మూవీలోని పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే.అలాగే తాజాగా రిలీజైన సినిమాలో మ్యూజిక్ సూపర్ అంటూ చాలా మంది రివ్యూస్ ఇస్తున్నారు.
ఇక సెట్స్‌పై ఉన్న అఖండ 2 సినిమాకు కూడా తమనే సంగీతం అందిస్తున్నాడు. ఈ లెక్కన బాలయ్య రాబోయే సినిమాలకు కూడా తమన్‌ను తప్ప మరొకర్ని ఊహించుకోవడం కష్టమే.