Directors: ఆ దర్శకుల లైనప్‌లో క్రేజీ కాంబోస్‌.. అయినా సస్పెన్స్ కంటిన్యూ..

Edited By: Prudvi Battula

Updated on: May 18, 2025 | 3:25 PM

ఇండస్ట్రీలో ఒక్క హిట్ పడితే చాలు ఆ దర్శకుల కోసం హీరోలు, నిర్మాతలు క్యూ కడతారు. కానీ ప్రజెంట్ కొంత మంది దర్శకులు బ్లాక్ బస్టర్ సక్సెస్ తరువాత కూడా నెక్ట్స్ ప్రాజెక్ట్ విషయంలో ఎలాంటి క్లారిటీ ఇవ్వటం లేదు. లైనప్‌లో క్రేజీ కాంబోస్‌ కనిపిస్తున్నా... అవి ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్తాయన్న విషయంలో సస్పెన్స్ కంటిన్యూ అవుతుంది. ఇంతకీ ఆ దర్శకులు ఎవరు..? ఈ స్టోరీలో చూద్దాం.

1 / 5
ఇండియన్ రికార్డ్స్‌ను మరోసారి తిరగరాసిన దర్శకుడు సుకుమార్‌. పుష్ప 2తో బాహుబలి రికార్డ్స్‌కు కాస్త చేరువలోకి వచ్చాన లెక్కల మాస్టర్‌, నెక్ట్స్ ప్రాజెక్ట్ లెక్క మాత్రం తేల్చలేకపోతున్నారు.

2 / 5
పుష్ప 2 సెట్స్ మీద ఉండగానే రామ్‌ చరణ్‌తో మూవీ ఉంటుందని ప్రకటించిన సుకుమార్‌.. ఆ ప్రాజెక్ట్‌ను ఎప్పుడు పట్టాలెక్కిస్తార్నది అర్ధం కావటం లేదు. చరణ్ లైనప్‌ మీద క్లారిటీ వస్తే తప్ప సుకుమార్ మూవీ విషయంలో క్లారిటీ వచ్చే ఛాన్స్‌ కనిపించటం లేదు.

3 / 5
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కూడా నెక్ట్స్ ప్రాజెక్ట్ విషయంలో క్లారిటీ ఇవ్వటం లేదు. గుంటూరు కారం రిలీజ్ అయిన ఏడాది దాటిన త్రివిక్రమ్ సినిమా పట్టాలెక్కలేదు. బన్నీతో చేయాల్సిన ప్రాజెక్ట్ వాయిదా పడటంతో డైలమాలో పడ్డారు గురూజీ. గ్యాప్‌లో వెంకటేష్‌, సమంతతో సినిమాలు ప్లాన్ చేస్తున్నారన్న టాక్ వినిపిస్తున్నా... ఏది అఫీషియల్‌గా కన్ఫార్మ్ కాలేదు.

4 / 5
కొత్త సినిమాకు మరీ లాంగ్ గ్యాప్ తీసుకుంటున్న దర్శకుడు వంశీ పైడిపల్లి. వారసుడు సినిమాతో బైలింగ్యువల్‌ బ్లాక్ బస్టర్‌ అందుకున్న ఈ క్లాస్ డైరెక్టర్‌, ఆ సినిమా రిలీజ్ అయి రెండేళ్లు దాటినా కొత్త ప్రాజెక్ట్‌ను ప్రకటించలేదు. ఆమిర్‌ ఖాన్‌తో మూవీ ఉంటుందన్న ప్రచారం జరుగుతున్నా.. అధికారికంగా ఎలాంటి ప్రకటనా లేదు.

5 / 5
హనుమాన్‌తో నేషనల్‌ లెవల్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసిన ప్రశాంత్‌ వర్మ కూడా కొత్త ప్రాజెక్ట్ విషయంలో సైలెన్స్ మెయిన్‌టైన్ చేస్తున్నారు. కన్నడ స్టార్ హీరో రిషబ్‌ శెట్టితో జై హనుమాన్‌ ప్రకటించినా... ఆ సినిమా ఇంకా పట్టాలెక్కలేదు. ఈ లోగా తన బ్యానర్‌లో వరుస ప్రాజెక్ట్స్‌ను లైన్‌లో పెట్టేస్తున్నారు. కానీ జై హనుమాన్‌ షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందన్న విషయంలో మాత్రం క్లారిటీ రావటం లేదు. అందుకే ఈ దర్శకుల నుంచి అఫీషియల్‌ అప్‌డేట్స్ కూడా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్‌.