
మహేష్ బాబు, రాజమౌళి కాంబోలో తెరకెక్కుతున్న సినిమా ఎస్ఎస్ఎంబీ 29. ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో అడ్వంచరస్ యాక్షన్ థ్రిల్లర్‌గా సినిమాను రూపొందిస్తున్నట్టుగా వెల్లడించారు ఈ మేకర్స్. అయితే గతంలో ఈ మూవీ నిథి అన్వేషణ నేపథ్యంలో తెరకెక్కుతుందన్న ప్రచారం జరిగింది.

ఆఫ్రికన్ ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ మూవీ ప్లాన్ చేస్తున్నారని, హాలీవుడ్ మూవీ మెకనాస్ గోల్డ్ తరహాలో కథా కథనాలు ఉంటాయన్న టాక్ వినిపించింది. కానీ తాజా అప్‌డేట్ ఈ సినిమా కథ విషయంలో మరో వర్షన్ తెర మీదకు తీసుకువచ్చింది.

ఎస్ఎస్ఎంబీ 29 కథ రామాయణంతో లింక్ అయి ఉంటుందన్నది లేటెస్ట్ అప్‌డేట్. యస్.. రామాయణ కాలం నాటి సంజీవని కోసమే ఈ సినిమాలో మహేష్ బాబు సాహసాలు చేయబోతున్నారన్నది లేటెస్ట్ ట్రెండింగ్ న్యూస్. అందుకే అడవులు, కొండల మధ్య ఎక్కువగా భాగం షూటింగ్ చేసేలా ప్లాన్ చేశారట జక్కన్న. అంతేకాదు మహేష్ క్యారెక్టర్ హనుమంతునిలా అనిపిస్తుందన్నది మరో టాక్.

అయితే ఈ వార్తలపై చిత్రయూనిట్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ముఖ్యంగా ఎస్ఎస్ఎంబీ 29 విషయంలో రాజమౌళి ఇంతవరకు నోరు విప్పలేదు. తన గత చిత్రాలను ప్రారంభించడానికి ముందే ప్రెస్‌మీట్ పెట్టి కథ, జానర్, కాస్టింగ్ విషయంలో క్లారిటీ ఇచ్చారు జక్కన్న. కానీ ఎస్ఎస్ఎంబీ 29కు అలాంటి ప్రయత్నమేమి చేయలేదు.

సైలెంట్‌గా పూజ కార్యక్రమాలతో సినిమాను స్టార్ట్ చేసి... అంతే సైలెంట్‌గా షూటింగ్ పనులు కానిచ్చేస్తున్నారు. ప్రియాంక చోప్రా ఇస్తున్న ట్రావెల్ అప్‌డేట్స్‌తోనే ఎస్ఎస్ఎంబీ 29 స్టేటస్ ఏంటన్నది ఫ్యాన్స్‌కు అర్ధమవుతోంది. అందుకే ప్రజెంట్ ట్రెండ్ అవుతున్న సంజీవని న్యూస్‌ను కూడా వైరల్ చేస్తూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మహేష్ - జక్కన్న ఫ్యాన్స్.