Sri Rama Navami: హక్కులకంటే బాధ్యత గొప్పదన్న రామతత్వం.. వెండితెరపై రామయ్యగా అలరించిన హీరోలు ఎవరో తెలుసా..

|

Mar 30, 2023 | 12:28 PM

హిందూ సంప్రదాయంలో దేవుళ్ళు ఎందరు ఉన్నా.. శ్రీరాముడికి ఉన్న ప్రత్యేక వేరు. రామయ్య వంటి యువకుడు తమ ఇంట్లో కూడా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకునే ఉత్తమ పురుషుడు. బంధం, అనుబంధాలకు బాధ్యతకు మానవ జీవితంలో ఏర్పడే కష్టాలను దైర్యంగా ఎదుర్కొన్న ధీరోదాత్తుడు రాముడు.. మానవతా విలువలు సంస్కృతి సంప్రదాయాలకు అర్ధం చెప్పిన రాముడి పాత్రలో తెలుగు వెండి తెరపై అనేక మంది హీరోలు పోషించారు. ఈ రోజు రాముడి పాత్రలో మెప్పించిన హీరోల గురించి తెల్సుకుందాం.. 

1 / 8

2 / 8
తెలువారికి రాముడు అంటే అన్న ఎన్టీఆర్ మాత్రమే అన్నంతగా ఆకట్టుకున్నారు స్వర్గీయ ఎన్టీఆర్.. మొదటిసారిగా వెండి తెరపై రాముడిగా 1932 లో విడుదలైన పాదుకా పట్టాభిషేకం సినిమాలో కనిపించారు.  తర్వాత శ్రీ రామ పట్టాభిషేకం, రామాంజనేయ యుద్ధం, లవ కుశ వంటి అనేక సినిమాల్లో రాముడిగా నటించారు. ఎన్టీఆర్ వెండి తెరపై 18 సార్లు శ్రీకృష్ణుడి పాత్రను పోషించారు. 

3 / 8
వెండి తెరపై శోభన్ బాబు కూడా శ్రీరాముడిగా నటించి మెప్పించారు. బాపు దర్శకత్వంలో తెరకెక్కిన  'సంపూర్ణ రామాయణం' వంటి సూపర్‌హిట్ సినిమాల్లో శ్రీరాముడిగా నటించాడు.

4 / 8
 తెలుగు తెరపై ఎన్టీఆర్ తర్వాత రాముడు గా మెప్పించిన నటుడు హరినాథ్. హరినాథ్ సీతారామ కళ్యాణం, శ్రీ రామ కథ అనే సినిమాలో రాముడు గా నటించి తెలుగు ప్రేక్షకుల మనసులో రామయ్య అంటే ఇలాగే ఉంటారేమో అనిపించేలా చేశారు 

5 / 8
జూనియర్ ఎన్టీఆర్ బాలనటుడిగా శ్రీరాముడిగా బాల రామాయణంలో నటించి మెప్పించారు. తాతను తగ్గ మనవుడిగా పేరు తెచ్చుకున్నాడు. వాల్మీకి రామాయణం ఆధారంగా తెరకెక్కిన బాల రామాయణం సినిమా ఆ ఏడాది ఉత్తమ పిల్లల చిత్రం'గా జాతీయ చలనచిత్ర అవార్డును అందుకుంది. 

6 / 8
బాపు దర్శకత్వంలో తెరకెక్కిన 'శ్రీరామ రాజ్యం' సినిమాలో నందమూరి బాలకృష్ణ శ్రీరాముడుగా నటించారు. వాల్మీకి రామాయణం ఆధారంగా రూపొందించబడిన చలనచిత్రం. దర్శకుడు బాపుకి ఇదే చివరి సినిమా కావడం విశేషం 

7 / 8
దేశవ్యాప్తంగా సనాతన హిందూ ధర్మంలో ముఖ్యమైన పాత్రలలో ఒకటి శ్రీరాముడు. తాజాగా ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్.. 'ఆదిపురుష్'లో శ్రీరాముడిగా నటిస్తున్నాడు. ఈ సినిమాపై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రభాస్ పౌరాణిక పాత్రలో నటించడం ఇదే మొదటి సారి.  'ఆదిపురుష'లో రాఘవగా ప్రభాస్‌ నటనను చూడాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే.. 

8 / 8
రాముడిగా ఏఎన్ఆర్  శ్రీ సీతా రామ జననం సినిమాలో నటించగా, కాంతారావు వీరాంజనేయ సినిమాతో పాటు మరి కొన్ని సినిమాలలో రాముడి గా కనిపించారు. ఇక శ్రీరామదాసు సినిమాలో సుమన్, దేవుళ్ళు సినిమాలో శ్రీకాంత్ నటించారు. 