
డబ్బు నాకు అవసరం అప్పా.. అలవాటు కాదు అంటూ జల్సాలో త్రివిక్రమ్ ఓ డైలాగ్ రాసారు గుర్తుందా..? ఇప్పుడు మన హీరోయిన్లకు ఈ మాట సరిగ్గా సరిపోతుంది. బాలీవుడ్ అనేది అవసరమే కానీ అలవాటు కాదంటున్నారు వాళ్లు. అకేషనల్‌గా ఓకే గానీ అక్కడే సెటిల్ అయిపోవాలనే తొందరేం లేదంటున్నారు. అందుకే హిందీలో భారీ బ్రేక్స్ ఇస్తున్నారు సౌత్ హీరోయిన్లు.

ఏమాటకామాటే.. ఒకప్పుడు బాలీవుడ్‌లో నటించాలని మన హీరోయిన్లు చూపించిన ఆ క్యూరియాసిటీ ఇప్పుడు వాళ్లలో కనిపించట్లేదు. తెలుగులో నటిస్తే చాలు.. ఇండియా అంతా ఏలేయొచ్చు అనే కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది

వాళ్లలో..! అందుకే హిందీలో అవకాశం వస్తే ఓకే కానీ అక్కడే సెటిల్ అయిపోవాలనే ఆశలైతే మన బ్యూటీస్‌లో ఏ కోశానా కనిపించట్లేదు. కావాలంటే కీర్తి సురేష్‌నే తీసుకోండి.. బేబీ జాన్ వచ్చి 6 నెలలు దాటినా ఇప్పటికీ రెండో హిందీ సినిమా సైన్ చేయలేదు.

ఈ మధ్యలో చాలా ఆఫర్స్ వచ్చినా ఎందుకో గానీ కీర్తి అటు వైపు పెద్దగా ఆసక్తి చూపించట్లేదు. జవాన్ తర్వాత నయనతార కూడా మరో హిందీ సినిమా చేయలేదు. త్రిష సైతం 2010లో వచ్చిన కట్టా మీటా తర్వాత బాలీవుడ్ వైపు చూడలేదు.

సమంత కూడా బాలీవుడ్‌లో బ్రేక్స్ బాగానే తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు హిందీలో సినిమాలేం చేయలేదు స్యామ్.. ఫ్యామిలీ మ్యాన్ 2తో గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా రక్త్ బ్రహ్మాండ్ సిరీస్ చేస్తున్నారు. అలాగే మిల్కీ బ్యూటీ తమన్నా కూడా అడపాదడపా బాలీవుడ్ వెళ్తున్నారు గానీ అక్కడే సెటిల్ అవ్వాలని చూడట్లేదు.