Social Media: సోషల్ మీడియా ఇండస్ట్రీకి సమస్యగా మారిందా.? ఇష్యూ ఎక్కడుంది..?

| Edited By: Prudvi Battula

Mar 14, 2024 | 10:45 AM

సోషల్ మీడియా.. ఈ రోజుల్లో మోస్ట్ డేంజరెస్ వెపన్.. అలాగే మోస్ట్ యూజ్ ఫుల్ వెపన్ కూడా. ఎవరెలా వాడుకుంటే అలా..! కానీ మన బ్యాడ్ లక్ ఏంటంటే ఇండస్ట్రీలో దీన్ని ఎక్కువగా ట్రోల్ చేయడానికో.. ఓ సినిమాను ఫ్లాప్ చేయడానికో వాడుతున్నారు. తాజాగా విశ్వక్ సేన్ ఇష్యూతో మరోసారి దీనిపై చర్చ మొదలైంది. అసలు సమస్య ఎక్కడుంది..? నిజంగానే సోషల్ మీడియాకు అంత పవర్ ఉందా..?

1 / 5
సోషల్ మీడియా అనేది ఓ సినిమాని ఎంతవరకు ప్రభావితం చేస్తుందో.. అంతే వెనక్కి నెట్టేస్తుంది కూడా. అది సినిమా పరంగానే కాదు.. వ్యక్తిగతంగా మనుషుల ఇమేజ్ పెంచడంలో, దిగజార్చడంలో సోషల్ మీడియా మెయిన్ వెపన్ ఇప్పుడు. తాజాగా తన గామి సినిమాకు బుక్ మై షోలో డబ్బులిచ్చి తక్కువ రేటింగ్స్ వేయిస్తున్నారంటూ విశ్వక్ సేన్ లెటర్ విడుదల చేసారు.

2 / 5
విద్యాధర్ తెరకెక్కించిన గామి గత వారమే విడుదలైంది. వచ్చినపుడు బుక్ మైషో రేటింగ్స్ 10కి 9 ఉంటే.. ఇప్పుడు 1కి ఎలా పడిపోయాయంటూ ప్రశ్నించారు విశ్వక్. గతంలో ఇదే వివాదం ఖుషీ సినిమా విషయంలో జరిగింది. తన సినిమా రేటింగ్స్ కావాలనే తక్కువ చేయిస్తున్నారని.. కొందరు తనను తొక్కడానికి ప్రయత్నిస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు విజయ్ దేవరకొండ.

3 / 5
గుంటూరు కారం సమయంలోనూ రేటింగ్స్ విషయంలో ఇలాంటి రచ్చే జరిగింది. ఇక అదే సినిమాలోని ఓ మై బేబీ పాట విడుదలైనపుడు ట్రోల్ చేస్తే.. లిరిక్ రైటర్ రామజోగయ్య శాస్త్రి సీరియస్ అయ్యారు. ప్రతివాడు మాట్లాడే వాడే.. రాయి విసిరే వాడే.. అభిప్రాయం చెప్పేదానికి ఒక పధ్ధతి ఉంటుందంటూ ట్వీట్ చేసారు శాస్త్రి.

4 / 5
సినిమాల రేటింగ్స్, రివ్యూస్ మాత్రమే కాదు.. వ్యక్తిగతంగానూ బాగా డిస్టర్బ్ చేస్తుంది సోషల్ మీడియా. ఈ మధ్యే భర్త విఘ్నేష్ శివన్‌ను టెక్నికల్ రీజన్స్‌‌తో అన్ ఫాలో చేసారు నయనతార. అక్కడ్నుంచి మొదలైంది మ్యూజిక్. తమ మధ్య అంతా బానే ఉందని చెప్పడానికి రోజుకు 10 ఫోటోలు అప్‌లోడ్ చేస్తున్నారు వీళ్లు. 

5 / 5
ఇక ప్రభాస్‌పై వచ్చే గాసిప్స్‌కు లెక్కే ఉండదు. అయన గురించి ఎన్ని వచ్చిన స్పందించకుండా తన పని తాను చేసుకొంటూ ఉంటారు డార్లింగ్. ఆయన విషయంలో  వస్తున్న గాసిప్స్‌పై అభిమానులు ఒక్కోసారి సీరియస్ గా రియాక్ట్ అవుతారు. మొత్తానికి సోషల్ మీడియా అలా మారిపోయిందిప్పుడు.