
కరీనా కపూర్ అటెలియర్ షికార్‌బాగ్ ప్రింటెడ్ ఫ్రెంచ్ షిఫాన్ చీరలో సొగసును ప్రదర్శించింది. ఆమె స్టైలింగ్‌ను అందరి దృష్టిని ఆకర్శించింది. అందమైన డ్రేప్‌ను డైమండ్ స్టడ్‌లు, బోల్డ్ స్టేట్‌మెంట్ రింగ్‌తో జత చేసింది.

మహారాష్ట్ర దినోత్సవం (మే 1) నాడు, డిజైనర్ ద్వయం అబు జానీ సందీప్ ఖోస్లా చేతితో నేసిన పైథానీ చీరలో అలియా భట్ అద్భుతంగా కనిపించింది. ఆమె లుక్ భారతీయ వస్త్రాల సూక్ష్మత, ఉత్సాహం, కళాత్మకత పరిపూర్ణగా కనిపించింది.

మనీష్ మల్హోత్రా రూపొందించిన ఆలివ్ గ్రీన్ టిష్యూ చీరలో శోభితా ధూళిపాళ అందరి దృష్టిని ఆకర్షించింది. దీని విలువ రూ. 3.9 లక్షలు. చేతితో ఎంబ్రాయిడరీ చేసిన ఈ కళాఖండం ఈ కార్యక్రమంలో అందరి దృష్టిని ఆకర్షించింది.

ఏకాయ బనారస్ పింక్ ఫెమ్మీ ఫాటలే చీరలో మానుషి చిల్లర్ అద్భుతంగా మెరిసింది. ఆ రంగు అందాల రాణిని చాల బాగా సెట్ అయింది. ఆ చీరలో ప్రేక్షకులను ఆకట్టుకుంది వయ్యారి భామ మనిషి.

బాలీవుడ్ ప్రముఖ నిర్మాత గునీత్ మోంగా వేవ్ సమ్మిట్‌లో ఇండో-వెస్ట్రన్ ఫ్యాషన్ చీరను ధరించారు.,మేధా తయారు చేసిన ఎరుపు, పసుపు రంగు చీరను ధరించారు. దానికి ఆమె బోల్డ్, మాగ్జిమలిస్ట్ ఆభరణాల శ్రేణితో జత చేసింది.