
టాలీవుడ్ హీరోయిన్, అక్కినేని కోడలు శోభిత దూళిపాళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కెరీర్ ప్రారంభంలో మోడలింగ్ చేసిన ఆమె ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. హీరోయిన్ గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

రామన్ రాఘవ్ 2.0 సినిమాతో ఎంట్రీ ఇచ్చిన శోభిత దూళిపాళ్ల మొదట్లో బాలీవుడ్ ఇండస్ట్రీలోనే ఎక్కువ సినిమాలు చేసింది. ఆ తర్వాత తెలుగులోకి కూడా ఎంట్రీ ఇచ్చింది.

అడవి శేషు హీరోగా చేసిన గూఢచారి సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది అక్కినేని కోడలు శోభిత. అలాగే మేజర్ సినిమాలోనూ ఒక కీలక పాత్రలో ఆకట్టుకుందీ అందాల తార

ఇక మంకీ మ్యాన్ సినిమాతో హాలీవుడ్ లోకి అడుగు పెట్టింది శోభిత. అలాగే ది నైట్ మేనేజర్ వంటి బ్లాక్ బస్టర్ వెబ్ సిరీసుల్లోనూ యాక్ట్ చేసింది.

గతేడాది అక్కినేని నాగ చైతన్యను ప్రేమ వివాహం చేసుకుంది శోభిత. పెళ్లి తర్వాత సినిమాల్లో అసలు కనిపించడం లేదీ అందాల తార. అదే సమయంలో సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది.

తాజాగా తమిళనాడుకి వెకేషన్ కి వెళ్లిన శోభిత అక్కడ విలేజ్ లో ప్రకృతిని ఆస్వాదిస్తూ దిగిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరలవుతున్నాయి