
దేశవ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. సామాన్యులు, సెలబ్రిటీలన్నా తేడా లేకుండా అందరూ తమ కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, సన్నిహితులతో కలిసి ఈ పర్వదినాన్ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు.

సినిమా తారల ఇళ్లలోనూ సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకోగా ఇప్పుడవి నెట్టింట వైరలవుతున్నాయి.

ఈ క్రమంలో కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ తన భార్య, పిల్లలతో కలిసి ఘనంగా సంక్రాంతిని సెలబ్రేట్ చేసుకున్నాడు. అనంతరం తమ వేడుకలకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడీ స్టార్ హీరో

శివకార్తికేయన్ భార్య పేరు ఆర్తి. వీరికి మొత్తం ముగ్గురు సంతానం. ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. ప్రస్తుతం వీరి ఫొటోలు నెట్టింట వైరలవుతున్నాయి

కాగా అమరన్ సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో ఫేమస్ అయ్యాడు శివ కార్తికేయన్. ఆ తర్వాత మదరాసి సినిమాతోనూ హిట్ అందుకున్నాడు. ఇప్పుడు పరాశక్తి అనే సినిమాతో మరోసారి ఆడియెన్స్ ముందుకు వచ్చాడు.

సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన పరాశక్తి సినిమా మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. సుధా కొంగర తెరకెక్కించిన ఈ పీరియాడికల్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో శ్రీలీల హీరోయిన్ గా నటించింది.