Sidharth Malhotra: సిద్ధార్థ్ టార్గెట్ సౌత్ హీరోయిన్సే.. నెక్స్ట్ ఆ ఇద్దరే..

Edited By: Prudvi Battula

Updated on: May 04, 2025 | 11:09 AM

సౌత్‌లో ఫేమస్‌ అయిన నాయికలతో ఎక్కువగా జోడీ కడుతున్నారు సిద్ధార్థ్‌ మల్హోత్రా. తన సినిమాలకు సౌత్‌లోనూ మంచి గుర్తింపు రావాలనే హ్యాండ్సమ్‌ హీరో ఈ ట్రిక్‌ని ఫాలో అవుతున్నారంటున్నారు క్రిటిక్స్. మరి అయన కాదండి.? నెక్స్ట్ సినిమా కోసం ఫిక్స్ అయన సౌత్ ముద్దుగుమ్మ ఎవరు.? ఈరోజు తెలుసుకుందాం రండి.. 

1 / 5
షేర్‌షా సినిమా థియేటర్లలో రిలీజ్‌ కాకపోయినా ఓటీటీకే పరిమితమైనా, ప్రజల మనసులను టచ్‌ చేసింది. అందుకే సందర్భం వచ్చిన ప్రతిసారీ ఆ మూవీని గుర్తుచేసుకుంటుంటారు ఫ్యాన్స్. సిద్, కియారా కెమిస్ట్రీ అదుర్స్ అంటూ సౌత్‌ నుంచి కాంప్లిమెంట్లు కూడా అందాయి.

2 / 5
అప్పటి నుంచి తన సినిమాల్లో సౌత్‌ హీరోయిన్లను ప్రిఫర్‌ చేస్తున్నారు సిద్ధార్థ్‌ మల్హోత్రా. మిషన్‌ మజ్నులో రష్మిక మందన్నతో కలిసి మెప్పించారు. మిషన్‌ మజ్ను తన కెరీర్లో చాలా స్పెషల్‌ అని ఇప్పటికే చాలా సార్లు చెప్పారు రష్మిక.

3 / 5
సిద్ధార్థ్‌ మల్హోత్రా నెక్స్ట్ సినిమాలో నాయికగా అనన్య పాండే పేరు వినిపించింది. అనన్య ఆల్రెడీ లైగర్‌ సినిమాతో సౌత్‌ ఆడియన్స్ కి పరిచితమే. ఆ సినిమా సక్సెస్‌ అయి ఉంటే, ఈ పాటికే సౌత్‌లో హల్‌చల్‌ చేసేవారు. సిద్ధార్థ్‌ సినిమాతో అయినా హిట్‌ అందుకోవాలని ఆకాంక్షిస్తున్నారు ఆమె అభిమానులు.

4 / 5
అనన్యను అప్రోచ్‌ అయిన మేకర్స్ లేటెస్ట్‎గా శ్రీలీల కాల్షీట్‌ అడుగుతున్నారట. అయితే శ్రీలీల ఇప్పటికి హిందీలో ఆషికీ 3 సినిమాలో కథనయికగా నటించింది. ఇది ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. త్వరలో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

5 / 5
సిద్ధార్థ్ మల్హోత్రాతో అనన్య అండ్‌ శ్రీలీల ఇద్దరూ కలిసి నటిస్తారా? లేకుంటే ఇద్దరిలో ఒకరే సెలక్ట్ అవుతారా? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ఇందులో ఏది జరిగినా సిద్ధార్థ్‌ సౌత్‌ కొలాబరేషన్‌ కంటిన్యూ అవుతుందన్నది మాత్రం నిజం.