
అందాల ముద్దుగుమ్మ శృతిహాసన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ చిన్నది. ఎప్పటికప్పుడు వరస ఫోటో షూట్స్‌తో సందడి చేస్తుంటుంది.

తాజాగా ఈ ముద్దుగుమ్మ బ్లాక్ డ్రెస్‌లో తన అందంతో అందరినీ కట్టిపడేసింది. ఈ బ్యూటీకి బ్లాక్ కలర్ అంటే చాలా ఇష్టం కావచ్చు. ఎందుకంటే ఎప్పుడూ శృతి హాసన్ బ్లాక్ కలర్ డ్రెస్స్‌లోనే కనిపిస్తుంటుంది. తాజాగా మరోసారి బ్లాక్ కలర్ డ్రెస్‌లో తన అందాలతో కుర్రకారుకు బాణాలు విసిరింది. ప్రస్తుతం ఈ ఫొటోస్ సోషల్ మీడియలో తెగ వైరల్ అవుతున్నాయి.

తెలుగులో సలార్ మూవీతో హిట్ అందుకున్న ఈముద్దుగుమ్మ ప్రస్తుతం మంచి జోష్‌లో ఉంది. ఏకంగా నాలుగు సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయింది.

నటనతో నేకాకుండా, స్పెషల్ క్యారెక్టర్స్, సింగ్ ఇలా ఏ ఆఫర్ వచ్చినా వదలకుండా, ఫుల్ బిజీ అయిపోతుంది ఈ చిన్నది. ఇక ఈ అమ్మడు ప్రస్తుతం తెలుగులో ఒక సినిమా చేస్తుండగా, తమిళంలో మూడు సినిమాలు చేస్తున్నట్లు సమాచారం.

ఇక ఈ బ్యూటీ రజినీ కాంత్ హీరోగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో రానున్న కూలీ సినిమాలో నటిస్తుంది. అంతే కాకుండా సలార్ 2లో కూడా ఈ బ్యూటీ నటిచనుంది. త్వరలో ఈ సినిమా పట్టాలెక్కనున్నట్లు సమాచారం.