గ్లామర్ క్వీన్స్‌గా సిల్వర్ స్క్రీన్ మీద సత్తా చాటిన ఇద్దరు బ్యూటీస్ నెమ్మదిగా సైడ్ అవుతున్నారు. రొటీన్ ఫార్ములా సినిమాలతో బోర్ కొట్టించటం కన్నా... కాస్త డిఫరెంట్‌గా ట్రై చేయటం బెటర్ అని ఫీల్ అవుతున్నారు.
అందుకే గ్లామర్ షో పక్కన పెట్టి డిఫరెంట్ ప్రాజెక్ట్స్‌ను లైన్‌లో పెడుతున్నారు. నిన్న మొన్నటి వరకు గ్లామర్ డాల్ రోల్స్‌లో కనిపించిన శ్రద్ధా కపూర్ ఇప్పుడు పూర్తిగా లేడీ ఓరియంటెడ్ సినిమాల మీద కాన్సన్‌ట్రేట్ చేస్తున్నారు.
స్త్రీ 2 బ్లాక్ బస్టర్ హిట్ కావటంతో అదే జోరులో నాగిన్ మూవీని లైన్‌లో పెట్టారు. లేటెస్ట్ టెక్నాలజీతో పాన్ ఇండియా రేంజ్‌లో ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నారు శ్రద్ధా.
సౌత్, నార్త్ ఇండస్ట్రీల్లో గ్లామర్ క్వీన్‌గా పేరు తెచ్చుకున్న కృతి సనన్ కూడా నెమ్మదిగా లేడీ ఓరియంటెడ్ సినిమాల వైపు అడుగులు వేస్తున్నారు. స్టార్ హీరోల సినిమాల్లో గ్లామరస్ క్యారెక్టర్స్‌లో కనిపిస్తున్నా, అందులోనూ పర్ఫెమెన్స్‌కు స్కోప్ ఉంటేనే యాక్సెప్ట్ చేస్తున్నారు.
తేరే బాంతోన్ మే ఐసా ఉల్జా జియా, క్రూ, దో పత్తి సినిమాల్లో గ్లామర్ యాంగిల్ చూపిస్తూనే మంచి నటిగానూ పేరు తెచ్చుకున్నారు. అప్ కమింగ్ సినిమాల విషయంలో కూడా గ్లామర్ కన్నా... కంటెంట్‌కే ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తున్నారు కృతి.