
అద్భుతం సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యారు శివాని రాజశేఖర్..

రాజశేఖర్, నటి జీవిత దంపతుల పెద్ద కుమార్తె శివాని. ఇప్పుడు ‘అద్భుతం’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చారు.

తేజ సజ్జా హీరోగా నటించిన ఈ సినిమాని.. మల్లిక్ రామ్ తెరకెక్కించారు.

ఈ సినిమా ఓటీటీ వేదిక విడుదలై మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుంది.

ఈ సినిమాలో శివాని నటనకు మంచి మార్కులు పడ్డాయి. అందంతో అభినయంతో ఆకట్టుకున్నారు శివాని

అద్భుతం సినిమా తర్వాత ఈ భామకు సినిమా ఆఫర్లు క్యూ కడుతున్నాయి.
