Manamey: ఆ నలుగురికి కీలకంగా మారిన “మనమే” సినిమా.. అందుకేనా ఇంత ఆసక్తి.?

Updated on: May 31, 2024 | 4:15 PM

మైనస్ మైనస్ ప్లస్ అవుతుందని చిన్నపుడు స్కూల్‌లో చదువుకున్నాం కదా..! ఇప్పుడలాంటి క్రేజీ కాంబినేషన్ ఒకటి టాలీవుడ్‌లో వస్తుంది. అందరూ ఫ్లాపుల్లోనే ఉన్నారు. అలాగని తక్కువ అంచనా వేయలేం. ఎందుకంటే వాళ్ల ట్రాక్ రికార్డ్ అలా ఉంది. కానీ ఈ సినిమా అందరి కెరీర్స్‌కు కీలకంగా మారింది. ఇంతకీ అంత ఆసక్తి రేపుతున్న ఆ సినిమా ఏంటో తెలుసా.? మనమే.. ఇన్నాళ్లూ ఈ సినిమా గురించి అస్సలు సౌండ్ లేదు.

1 / 7
మైనస్ మైనస్ ప్లస్ అవుతుందని చిన్నపుడు స్కూల్‌లో చదువుకున్నాం కదా..! ఇప్పుడలాంటి క్రేజీ కాంబినేషన్ ఒకటి టాలీవుడ్‌లో వస్తుంది. అందరూ ఫ్లాపుల్లోనే ఉన్నారు.

2 / 7
అలాగని తక్కువ అంచనా వేయలేం. ఎందుకంటే వాళ్ల ట్రాక్ రికార్డ్ అలా ఉంది. కానీ ఈ సినిమా అందరి కెరీర్స్‌కు కీలకంగా మారింది. ఇంతకీ అంత ఆసక్తి రేపుతున్న ఆ సినిమా ఏంటో తెలుసా..?

3 / 7
మనమే.. ఇన్నాళ్లూ ఈ సినిమా గురించి అస్సలు సౌండ్ లేదు. ఎలాంటి సందడి లేకుండా షూటింగ్ పూర్తి చేసారు దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య. శర్వానంద్, కృతి శెట్టి జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది.

4 / 7
చడీ చప్పుడు లేకుండా జూన్ 7న విడుదల తేదీ ఖరారు చేసుకుంది మనమే. తాజాగా ఈ చిత్ర ప్రమోషన్స్‌లో జోరు పెంచేసారు మేకర్స్. కొన్నేళ్లుగా శర్వానంద్ కెరీర్‌కు బ్లాక్‌బస్టర్ లేదు. పైగా 2022లో ఒకే ఒక జీవితం సినిమాతో వచ్చిన శర్వా..

5 / 7
లాంగ్ గ్యాప్ తీసుకుని మనమే అంటూ వస్తున్నారు. ఒకే ఒక జీవితం ఓకే అనిపించింది కానీ బ్లాక్‌బస్టర్ అయితే కాదు. ఇక కృతి శెట్టికి కూడా బంగార్రాజు తర్వాత వచ్చిన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, వారియర్, మాచెర్ల నియోజకవర్గం, కస్టడీ ఫ్లాపయ్యాయి.

6 / 7
మనమే సక్సెస్ ఇటు శర్వా.. అటు కృతి కెరీర్స్‌కు కీలకంగా మారింది. దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య పరిస్థితి కూడా అంతే. సరైన బ్లాక్‌బస్టర్ కోసం 9 ఏళ్ళుగా వేచి చూస్తున్నారు ఈ దర్శకుడు.

7 / 7
భలే మంచి రోజు, దేవదాస్ లాంటి సినిమాలతో ఓకే అనిపించినా.. సక్సెస్ అందుకోలేదు శ్రీరామ్ ఆదిత్య. పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి హిట్టొచ్చి చాలా కాలమైంది. అందుకే అందరికీ మనమే సినిమా కీలకం కానుంది.