
రెండు తెలుగు రాష్ట్రాల్లో సీరియల్స్ చూసేవారి సంఖ్య గురించి చెప్పక్కర్లేదు. హీరోహీరోయిన్లకు మించిన పాపులారిటి.. ఇప్పుడు సీరియల్ తారలకు ఉంటుంది. సహజ నటన, ఆకట్టుకునే స్క్రీన్ ప్రెజెన్స్ తో చిన్న వయసులోనే స్టార్ స్టేటస్ సాధించింది.

ఆ నటి మరెవరో కాదు... ప్రియాంక జైన్. మౌనరాగం సీరియల్ ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత జానకి కలగనలేదు సీరియల్ ద్వారా మరింత ఫేమస్ అయ్యింది. తక్కువ సమయంలోనే తన నటనతో ప్రేక్షకుల మనసు గెలుచుకుంది.

ఆ తర్వాత బిగ్ బాస్ తెలుగు 7లో పాల్గొని టాప్ 5గా నిలిచింది. ఈ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రియాంక సీరియల్స్ మానేసింది. తన ప్రియుడు శివశంకర్ తో కలిసి సోషల్ మీడియాలో సందడి చేస్తుంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోస్ వైరల్ గా మారాయి.

తన కెరీర్ ముందుగా మోడలింగ్ ద్వారా ప్రారంభమైందని.. ఆ సమయంలో తన హైట్ గురించి నెగిటివ్ కామెంట్స్ వచ్చాయని.. కొందరు మాత్రమే ప్రోత్సహించారని తెలిపింది. సీరియల్స్ వల్లే తనకు అసలై గుర్తింపు వచ్చిందని చెప్పుకొచ్చింది.

సీరియల్స్ మానేయడానికి గల కారణం చెప్పింది. సీరియల్స్ చేస్తే ఒకే రోల్ లో బందీ అయిపోతామనే భయం ఉందని.. సరైన డేట్స్, టైం దొరకదని.. సీరియల్ క్యారెక్టర్లకే పరిమితమైపోతామన్న భావనతోనే సీరియల్స్ చేయడం లేదని తెలిపింది