
సినిమా ప్రపంచంలో హీరోయిన్లుగా గుర్తింపు తెచ్చుకోవడం అంత సులభం కాదు. ఒక్క సినిమాతో సక్సె్స్ అయినవారు చాలా మంది ఉన్నారు. కానీ మొదటి సినిమా ఫలితం కాస్త అటు ఇటు అయితే పరిస్థితి మొత్తం మారిపోతుంది. కొన్నిసార్లు తారల జీవితాలు కూడా మారిపోతుంటాయి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ సైతం ఆ జాబితాలోకి చెందినవారే.

ఇప్పుడు సోషల్ మీడియాలో మారుమోగుతున్న పేరు సారా అర్జున్. మొన్నటి వరకు చైల్డ్ ఆర్టిస్టుగా మెప్పించిన ఈ అమ్మడు.. ఇప్పుడు హీరోయిన్ గా అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. కథానాయికగా తొలి చిత్రంతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. హిందీలో ధురంధర్ సినిమాతో కథానాయికగా కనిపించింది సారా.

ఈసినిమాతో ఆమె పేరు పాన్ ఇండియా లెవల్లో మారుమోగింది. తొలి చిత్రంతోనే ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. ఇప్పుడు యుఫోరియా సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయం కాబోతుంది. ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ చిత్రంలో భూమిక కథానాయికగా నటిస్తుండగా.. ఇందులో సారా అర్జున్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. యుఫోరియా సినిమాతో ఇప్పుడు ఆమె పేరు తెగ వినిపిస్తుంది. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 6న విడుదల చేయనున్నారు. ఇప్పుడు ఈ సినిమా తర్వాత తెలుగులో సారా అర్జున్ కు మరిన్ని ఆఫర్స్ రావడం ఖాయమని తెలుస్తోంది.

సారా అర్జున్... గతంలో సౌత్ ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్టుగా కనిపించింది. విక్రమ్ చియాన్ నటించిన నాన్న సినిమాలో నటించింది. ఇందులో విక్రమ్, సారా అర్జున్ బాండింగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. చాలా కాలం తర్వాత పొన్నియన్ సెల్వన్ చిత్రంలో ఐశ్వర్యరాయ్ టీనేజ్ అమ్మాయి పాత్రలో కనిపించింది.