
బాలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకుపోతోన్న అందాల భామ సారా అలీ ఖాన్. తక్కువ సమయంలోనే అక్కడ మంచి పాపులారిటీ సొంతం చేసుకుంది.

కుర్ర హీరోల సరసన ఛాన్స్‌లు అందుకుంటున్న సారా అదే రేంజ్ లో హిట్స్ కూడా తన ఖాతాలో వేసుకుంటుంది.

ప్రస్తుతం సెన్సేషనల్ బ్యూటీగా బాలీవుడ్ లో దూసుకుపోతోన్న సారా .. సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది.

ఈ అమ్మడికి సోషల్ మీడియాలో ఫాలోవరస్ కూడా భారీగానే ఉన్నారు . నిత్యం రకరకాల ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటోంది.

ఇక ఈ చిన్నది వెకేషన్స్ కూడా వెళ్తూ ఉంటుంది. రకరకాల ప్లేస్ ల్లో ఫోటోలు దిగి షేర్ చేస్తూ ఉంటుంది.

తాజాగా విదేశాల్లో చక్కర్లు కొడుతూ.. ఆ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది ఈ భామ. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.