
మయోసైటీస్ వ్యాధి బారిన పడిన ఈముద్దుగ్మమ, చాలా రోజుల పాటు ఆసమస్యతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. దీంతో శారీరకంగా, మానసికంగా ఈ బ్యూటీ చాలా కుంగిపోయింది. అంతే కాకుండా మయోసైటీస్ సమస్య వలన కొన్ని రోజుల పాటు సినిమాలకు కూడా బ్రేక్ ఇచ్చింది ఈ బ్యూటీ. సినిమాలకు బ్రేక్ ఇచ్చి పూర్తిగా ఆరోగ్యంపై కేర్ తీసుకుంది.

తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. అయితే ఈ బ్యూటీ ఎక్కువగా బాలీవుడ్, హాలీవుడ్ వైపే ఇంట్రెస్ట్ చూపిస్తుండటంతో తెలుగు అభిమానులు కాస్త నిరశా వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ మధ్య కాలంలో సమంత తెలుగులో మంచి అవకాశాలు వస్తే చేయడానికి రెడీ అని చెప్పడంతో, సమంత మళ్లీ టాలీవుడ్‌లోకి వస్తుందంటూ తన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఇక డివోర్స్ తర్వాత సమంత చాలా సీరియస్ లుక్‌లో ఫొటోలకు ఫోజులిచ్చింది. కానీ చాలా రోజుల తర్వాత సామ్, నవ్వుతూ చీరలో అందంగా కనిపించింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. సమంత ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి 15 సంవత్సరాలు అవ్వడంతో తనకు బిహైండ్ వుడ్స్ అవార్డ్ అందజేశారు.

ఈ అవార్డ్స్ ఈవెంట్‌కు సమంత చీరలో అందంగా రెడీ అయివెళ్లింది.అంతేకాకుండా చూడటానికి చాలా చక్కగా, నవ్వుతూ కనిపించింది.

దీంతో సామ్ చాలా రోజుల తర్వాత ఇంత హ్యాప్పీగా ఉండటం చూశాం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఎప్పుడూ ఇలానే ఉండాలని కోరుతున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.