
నథింగ్ టూ హైడ్ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో సమంత పోస్ట్ చేసిన ఓ వీడియో వైరల్ అవుతుందిప్పుడు. అందులో అంత ప్రత్యేకత ఏముంది అనుకోవచ్చు.. చాలా ప్రత్యేకమైన వీడియోనే అది.

ఎందుకంటే ఇన్నాళ్లూ సమంత ఒంటిపై టాటూగా ఉన్న నాగ చైతన్య జ్ఞాపకం ఒకటి పూర్తిగా తొలిగిపోయింది. స్యామ్ మెడ కింద ఉండే YMC టాటూ ఇకపై కనిపించదు.తన తొలి సినిమా ఏ మాయ చేసావే.. అలాగే చైతూకు గుర్తుగా YMC అనే టాటూ వేయించుకున్నారు స్యామ్.

విడాకులు తీసుకున్నాక కూడా అదలాగే కంటిన్యూ అయింది. కానీ తాజాగా పోస్ట్ చేసిన వీడియోలో మెడ కింద YMC టాటూ మాయమైంది. అంటే చైతూ గుర్తులేవీ తన దగ్గర ఉండకూడదని ఫిక్సైపోయింది ఈ బ్యూటీ.

ఆ మధ్య ఎంగేజ్మెంట్ రింగ్‌ను లాకెట్‌గా మార్చేసింది సమంత. విడాకుల తర్వాత మెల్లమెల్లగా గత జ్ఞాపకాల నుంచి బయట పడుతున్నారు సమంత. ఈ క్రమంలోనే తన పెళ్ళి గౌన్‌ను రీమోడల్ చేయించి నల్లటి కాక్‌టెయిల్ డ్రెస్‌గా మార్చేసారు ఈ భామ.

అలాగే చైతూ టాటూకు లింక్డ్‌గా ఉన్న టాటూను తీసేసారు.. రింగ్‌ను లాకెట్ చేసారు.. తాజాగా YMC టాటూ కూడా పోయింది. రోజురోజుకీ సమంతలో వస్తున్న మార్పుకు ఇవన్నీ నిదర్శనంగా కనిపిస్తున్నాయి.