టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ చిత్రం శాకుంతలం. డైరెక్టర్ గుణశేఖర తెరకెక్కించిన ఈ చిత్రంలో మలయాళీ హీరో దేవ్ మోహన్ కీలకపాత్రలో నటించారు.

శకుంతల, దుష్యంతనుల ప్రేమకథ ఆధారంగా రూపొందించిన ఈ అభిజ్ఞాన శాకుంతలం చిత్రం ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో సినిమా ప్రచార కార్యక్రమాలు షూరు చేసింది చిత్రయూనిట్.

బుధవారం ఉదయం డైరెక్టర్ గుణశేఖర్, ప్రొడ్యూసర్ నీలిమతో కలిసి సమంత, దేవ్ మోహన్ పెద్దమ్మ తల్లి ఆలయానికి చేరుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు శాకుంతలం చిత్రయూనిట్.

ఈ సినిమా పై ఇప్పటికే ప్రేక్షకులలో క్యూరియాసిటి నెలకొంది. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, ట్రైలర్ మూవీపై అంచనాలను పెంచింది.

ఇందులో ప్రకాష్ రాజ్, అదితి బాలన్, మోహన్ బాబు, మధుబాల, అనన్య నాగల్ల, గౌతమి కీలకపాత్రలలో నటించగా.. స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ బాలనటిగా తెరంగేట్రం చేస్తుంది.

ఇందులో ప్రకాష్ రాజ్, అదితి బాలన్, మోహన్ బాబు, మధుబాల, అనన్య నాగల్ల, గౌతమి కీలకపాత్రలలో నటించగా.. స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ బాలనటిగా తెరంగేట్రం చేస్తుంది.

ఈ చిత్రం తెలుగుతోపాటు.. మలయాళం, తమిళం, కన్నడ, హిందీ భాషలలో విడుదల కానుంది.

'శాకుంతలం' ప్రమోషన్స్ స్టార్ చేసిన సమంత, దేవ్ మోహన్.. పెద్దమ్మ ఆలయంలో చిత్రయూనిట్ పూజలు..