
ప్రస్తుతం సోషల్ మీడియాలో అత్యథిక ఫాలోయింగ్ సొంతం చేసుకున్న బ్యూటీ దేవియాని శర్మ. స్టార్ హీరోయిన్ కాకపోయిన తనదైన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది ఈ ముద్దుగుమ్మ. విభిన్నమైన కథలు.. వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకుంది.

అతి తక్కువ సమయంలోనే తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ముద్దుగుమ్మ దేవియాని శర్మ. సైతాన్ వెబ్ సిరీస్ లో ఈ బ్యూటీ బోల్డ్ పెర్ఫార్మెన్స్ చూసి ఆశ్చర్యపోయారు నెటిజన్స్. దీంతో ఈ అమ్మడు గురించి తెలుసుకోవడానికి సోషల్ మీడియాలో వెతకడం స్టార్ట్ చేశారు.

దేవియాని శర్మ ఇటీవల ఓటీటీలో సూపర్ హిట్ అయిన సేవ్ ది టైగర్స్ వెబ్ సిరీస్ లో మోడ్రన్ ఐడియాలజీ ఉన్న భార్య పాత్రలో అద్భుతమైన నటనతో ఆకట్టుకుంది. అలాగే సైతాన్ వెబ్ సిరీస్ లో మాస్ అండ్ బోల్డ్ క్యారెక్టర్ చేసి మెప్పించింది.

అటు బోల్డ్ క్యారెక్టర్ చేసిన దేవయాని.. ఇటు సేవ్ ది టైగర్స్ సిరీస్ లో మోడ్రన్ టచ్ చూసేసరికి అందరూ షాకయ్యారు. ఆ తర్వాత అనగనగా అనే వెబ్ సిరీస్ చేసి మెప్పించింది. తర్వాత ఇన్ ది నేమ్ ఆఫ్ ది గాడ్ వెబ్ సిరీస్ చేసింది. ఆకాష్ పూరి రొమాంటిక్ మూవీలో కీలకపాత్రలో నటించింది.

ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాలో దేవియాని శర్మ చాలా యాక్టివ్. నిత్యం తన గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తుంటుంది. తాజాగా చీరకట్టులో వయ్యారాలు ఒలకబోస్తూ నెట్టింట సెగలు పుట్టించింది ఈ బ్యూటీ. దేవియాని లేటేస్ట్ శారీ లుక్స్ చూసి ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్.