Rajeev Rayala |
Jul 11, 2024 | 11:24 PM
రుక్సార్ ధిల్లన్.. ఈ అమ్మడు ఆకతాయి అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఆతర్వాత నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన కృష్ణార్జున యుద్ధం సినిమాలో హీరోయిన్ గా చేసింది.
ఈ సినిమాలో తన నటనతో పాటు తన అందంతోనూ ఆకట్టుకుంది ఈ బ్యూటీ. ఆతర్వాత అల్లు శిరీష్ హీరోగా నటించిన ఏబీసీడీ అనే సినిమాలో చేసింది. ఈ సినిమా కూడా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది ఈ మూవీ.
అలాగే హిందీలోనూ సినిమాలు చేసింది. ఆతర్వాత విశ్వక్ సేన్ హీరోగా నటించిన అశోకవనంలో అర్జున కల్యాణం సినిమాతో హిట్ అందుకుంది. ఈ సినిమాలో కూడా రుక్సార్ ధిల్లన్ సెకండ్ హీరోయిన్ గా చేసింది.
స్పార్క్ ఎల్.ఐ.ఎఫ్.ఈ, నా సామిరంగా సినిమాల్లో నటించింది రుక్సార్ ధిల్లన్. ఇక ఈ అమ్మడు ఆశించిన స్థాయిలో అవకాశాలు అందుకోలేకపోతుంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ బ్యూటీ చాలా యాక్టివ్ గా ఉంటుంది.
తన అందాలతో దర్శక నిర్మాతలకు గాలాలు వేస్తుంది ఈ బ్యూటీ. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ఈ ఫోటోలకు కుర్రకారు ఫిదా అవుతున్నారు. నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.