రీతూ వర్మ చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ మొదలు పెట్టి ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్‌గా తన సత్తా చాటుతోంది. బాద్ షా మూవీలో ఈ అమ్మడు కాజల్‌కి చెల్లి పాత్రలో నటించి మంచి ఫేమ్ సంపాదించుకుంది. అంతే కాకుండా పలు సినిమాల్లో సైడ్ క్యారెక్టర్స్ చేసింది.
తర్వాత పెళ్లి చూపులు మూవీలో విజయ్ దేవరకొండ సరసన హీరోయిన్‌గా చేసి తెలుగు అభిమానుల మనసు గెలుచుకుంది ఈ ముద్దుగుమ్మ. దీంతో ఈ అమ్మడుకు వరసగా అవకాశాలు రావడం మొదలు పెట్టాయి. తెలుగు, తమిళం ఇలా చాలా భాషల్లో ఈ బ్యూటీ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ అయిపోయింది.
రీసెంట్‌గా మజాకా మూవీతో తెలుగు అభిమానుల ముందుకు వచ్చిన ఈ అమ్మడు, మూవీ డిజాస్టర్ అయినా రీతూ వర్మకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. ఈ సినిమాలో ఈ బ్యూటీ తన గ్లామర్‌తో అందరినీ ఆకట్టుకుంది.
ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉండే ఈ చిన్నది. వరస ఫొటోషూట్స్‌తో కుర్రకారు మతిపొగొడుతుంటుంది. తాజాగా ఈ బ్యూటీ లెహెంగాలో అదిరిపోయింది.
సింపుల్ లుక్‌లో మల్టీకలర్ లెహెంగాలో కొంటె చూపు చూస్తూ.. క్యూట్ స్మైల్‌తో ఉన్న ఈ ఫొటోలు నెటిజన్స్‌ను తెగ ఆకట్టుకుంటున్నాయి. దీంతో తన అభిమానుల నుంచి పెద్ద ఎత్తున కామెంట్స్, లైక్స్ వస్తున్నాయి.