
సౌత్ సినీ పరిశ్రమలో మరో విషాదం నెలకుంది. హాస్యనటుడు వివేక్(59) తుదిశ్వాస విడిచారు. గురువారం మధ్యాహ్నం తీవ్ర గుండెపోటుతో చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో వివేక్ చేరిన విషయం తెలిసిందే. చికిత్స పొందుతూ ఈ తెల్లవారుజామున 4.30 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారు.

వివేక్ ఆకస్మిక మరణంతో తమిళ చిత్రపరిశ్రమలో తీవ్ర దిగ్భ్రాంతి నెలకొంది. వివేక్ ఆకస్మిక మృతిపట్ల పలువురు భారతీయ సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.

ప్రముఖ దర్శకుడు కె.బాలచందర్ వెండితెరకు పరిచయం చేసిన నటుల్లో వివేక్ ఒకరు. బాలచందర్ దర్శకత్వం వహించిన 'మనదిల్ ఉరుది వేండం' అనే చిత్రంతో వివేక్ నటుడిగా ఇండస్ట్రీ ఇచ్చారు. అనంతరం హాస్యనటుడిగా ఆయన ప్రస్థానం అప్రతిహతంగా సాగింది

తమిళ నటుడు వివేక్

కాగా కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న 24 గంటల్లోనే వివేక్ పరిస్థితి విషమంగా మారి గుండెపోటు రావడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కోవిడ్ వ్యాక్సిన్‌కు, గుండెపోటు సంబంధం లేదని డాక్టర్లు తెలిపారు.

వివేక్ కోలీవుడ్ లో వడివేలు, సెంథిల్, గౌండ్రమణి తర్వాత హాస్యనటుడిగా ఆ రేంజ్ లో క్రేజ్ ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఏది ఏమైనా ఆయన లేని లోటు చిత్ర పరిశ్రమకు పూడ్చలేనిది.