ఎరుపు రంగు చీరలలో ముద్దుగుమ్మలు.. పెళ్లికి హీరోయిన్స్ స్పెషల్ అట్రాక్షన్.. ఏంటీ ప్రత్యేకత..

Edited By:

Updated on: Feb 28, 2026 | 1:02 PM

ఆత్మీయులందరూ అక్షితలు చల్లుతున్న వేళ వధువు అలంకరణ మీద ప్రత్యేక శ్రద్ధ తప్పక ఉంటుంది... పెళ్లి కూతురు మండపంలో ముస్తాబై కూర్చున్నప్పుడు ఎరుపు రంగు చీర కట్టుకుంటే ఆ అందాన్ని వర్ణించడం ఎవరి తరం? అందులోనూ సినీ సెలబ్రిటీల వివాహ క్రతువులో ఎరుపు రంగు చీరల అందాన్ని గమనించని వారుంటారా... ఆలస్యమెందుకు? రీసెంట్‌ టైమ్స్ లో .

1 / 5
విజయ్‌ రష్మిక మూడుముళ్ల వేడుకలో రష్మిక  కట్టుకున్న చీర గురించి అందరూ ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారు. విజయ్‌ దేవరకొండ నా భర్త అంటూ పరిచయం చేసిన ఫొటోల్లో రష్మిక ఎరుపు రంగు చీర కట్టును చూసి ఫిదా అవుతున్నారు నేషనల్‌ క్రష్‌ ఫ్యాన్స్.

2 / 5
రాజ్‌ని భూత శుద్ధి వివాహం చేసుకున్నారు సామ్‌. అందరూ సమంత రెండో పెళ్లి గురించి మాట్లాడుకుంటూ ఉండగా, ఈ వేడుకను ఇంత ప్రత్యేకంగా తీర్చిదిద్దిన కాస్ట్యూమ్స్ డిజైనర్‌కి థాంక్స్ చెప్పారు సామ్‌. ఆ క్షణమే సామ్‌ కట్టుకున్న ఎరుపు రంగు చీర గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టేశారు నెటిజన్లు. అంతే కాదు, నయనతార పెళ్లిలో కట్టుకున్న చీర రంగు కూడా ఇదేనని గుర్తుచేసుకున్నారు.

3 / 5
మలయాళ బ్యూటీలు  నయన్‌ అండ్‌ సామ్‌ మాత్రమే కాదు, మన తెలుగింటి కోడలైన లావణ్య త్రిపాఠి కూడా పెళ్లికూతురైన వేళ కుంకుమ రంగు చీరే కట్టుకున్నారు. వరుణ్‌తేజ్‌తో దండలు మార్చుకున్న ఆ క్షణం ఆమె సిగ్గు కు తోడైంది ఎరుపు రంగే.

4 / 5
మన వాళ్లే కాదు, నార్త్ హీరోయిన్లు కూడా లాల్‌ రంగ్‌ కా ప్రేమ్‌ని ఎప్పటికప్పుడు చాటుకుంటూనే ఉన్నారు. విక్కీ కౌశల్‌ని పెళ్లి చేసుకున్నప్పుడు వధువుగ కత్రినా మెరిసింది కూడా ఎరుపు రంగు చీరలోనే. రాజ్‌కుమార్‌ రావు పెళ్లి వేడుకలో వధువు కట్టుకున్నదీ రెడ్‌ శారీనే.

5 / 5
పెళ్లిలో కాకపోయినా, ఓ  సందర్భంలో సిద్ధార్థ్‌తో కలిసి ఎరుపు రంగు చీరలో కనిపించారు అదితిరావు హైదరి. మన దీపిక పెళ్లి కూతురిగా కనిపించిన క్షణాలు గుర్తున్నాయా? రెడ్‌ శారీలో ఎలిగెంట్‌గా కనిపించారు దీప్‌.

Follow Us